Monday, September 9, 2024
spot_img

పేద కుటుంబాలకు బియ్యం పంపిణీ..

తప్పక చదవండి

హైదరాబాద్, భారతీయ జనతా పార్టీ, యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధ్యక్షులు రామనగోని శంకరయ్య, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల లింగోజిగూడెం గ్రామంలో ఎస్సీ వాడలో ఈనెల12, 13 ,14, తేదీల్లో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, ముత్యాలమ్మ తల్లి బోనాలు ఉత్సవాల సందర్భంగా లింగోజిగూడెం గ్రామంలోని ఎస్సీ వాడలో పేద కుటుంబాలకు చేయూతగా ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం పంపిణీ చేస్తూ.. ప్రతి ఇంట్లో సంతోషం వెళ్లివిరియాలని, ప్రతి కుటుంబ పండుగను సుఖ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆర్థికంగా సహాయ సహకారాలతో తను ఎల్లప్పుడూ వారి వెంట ఉంటానని.. వారికి ఏ ఆపద ఉన్న ఆదుకుంటానని హామీ ఇస్తూ.. సోమవారం రోజు బిజెపి గ్రామ శాఖ తరపున 100 కుటుంబాలకు 25 కేజీల బియ్యం బస్తాల పంపిణీ చేయనైనది. ప్రతి ఒక్కరూ మన ప్రధాని నరేంద్ర మోడీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని.. తెలంగాణ రాష్ట్రంలో, కేంద్రంలో బిజెపిని మరొక్కసారి బిజెపి అధికారంలోకి రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త సమయం ఇచ్చి పార్టీ విజయం కొరకు పని చేయగలరని.. రాష్ట్రంలో, దేశంలో బిజెపి అధికారంలోకి వస్తే భారతదేశ వైభవాన్ని ప్రపంచ దేశాలు గర్వించే విధంగా మన ప్రధాని మోడీ విధానాలు తీసుకొస్తారని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ బిజెపి ఫ్లోర్ లీడర్ పోలోజు శ్రీధర్ బాబు, గుజ్జుల సురేందర్ రెడ్డి, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తుల జంగయ్య గౌడ్,ఉబ్బు వెంకటయ్య, మాజీ సర్పంచ్ దీపికా శంకరయ్య, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దాసోజు భిక్షమాచారి, పిల్ల బుచ్చయ్య, కాసుల వెంకటేశం, పాలకూరల జంగయ్య గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ బొడ్డు పద్మ యాదయ్య మహిళా మోర్చా అధ్యక్షురాలు కడారి కల్పన, మండల దళిత మోర్చా అధ్యక్షులు ఎర్ర గణేష్, ఓబీసీ మోర్చా రూరల్ అధ్యక్షుడు అన్యాలపు నరేష్, కొండాపురం దుర్గయ్య ఎర్ర నరసింహ భూత్ అధ్యక్షులు కడారి ఐలయ్య యాదవ్, ఊదర రంగయ్య, ఎర్రగోని సత్యనారాయణ, పిల్ల యాదయ్య, బత్తిని దాసు, తూర్పునూరి నరసింహ, బి. సురేష, బాతరాజు లింగస్వామి, బాతరాజూ గణేష్, తూర్పునూరు సాయి, రాజు, శివశంకర్, మల్లేశం, ఊదరి అంజయ్య, బోసి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు