Friday, May 3, 2024

డెజీగా రీబ్రాండ్ చేయబడిన డెంటల్ కేర్ స్టార్టప్ స్మైల్స్.ఏఐ..

తప్పక చదవండి
  • వార్షిక ఆదాయం రూ.300 కోట్లు ఉండేలా
    2025 ఆర్థిక సంవత్సరం నాటికి 300 క్లినిక్‌లను ప్రారంభించే యోచన

హైదరాబాద్, బెంగుళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన డెజీ నేడు భారతదేశం అంతటా 150+ భాగస్వాములు, 24 సిగ్నేచర్ క్లినిక్‌లను కలిగి ఉంది. ఇది సెక్వోయా, చిరాటే, ఫాల్కన్ ఎడ్జ్ (ఆల్ఫావేవ్) వంటి ప్రముఖ పెట్టుబడి సంస్థల నుండి నిధులను సేకరించింది. దంత సంరక్షణ పరిశ్రమలో ప్రీమియం స్పెషలిస్ట్‌ గా తన స్థాపనను పటిష్టం చేసుకున్న డెంటల్ హెల్త్ సొల్యూషన్స్ స్టార్టప్ స్మైల్స్.ఏఐ 300 క్లినిక్‌లు ప్రారంభించడం, 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 300 కోట్ల వార్షిక ఆదాయం సాధించాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికలతో డెజీగా రీబ్రాండ్ చేసుకుంది. రీబ్రాండింగ్ అనేది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అత్యుత్తమ దంత ఆరోగ్య సేవలను అందించడంలో డీ 2 సి బ్రాండ్ నిబద్ధ తను ప్రతిబింబిస్తుంది. ఇది రోగుల ఇంటి వద్దకే పారదర్శకత, చికిత్సను సులభతరం చేస్తుంది. ఒక ప్రముఖ స్పెషలిస్ట్ బ్రాండ్ అయిన డెజీ అత్యాధునిక స్మార్ట్ టెక్నాలజీతో మానవ నైపుణ్యాన్ని సజావుగా ఏకీకృతం చేయడంలో క్యూరేటివ్, కాస్మెటిక్, ప్రివెంటివ్‌లో రాణిస్తోంది. రోగ నిర్ధారణ, చికిత్స, ధర పారదర్శకతతో పాటు వినియోగదారులకు ఎటు వంటి హఠాత్తు పెంపు బిల్లింగ్‌లు లేకుండా వారి వైద్య ఖర్చులను ఉత్తమంగా ప్లాన్ చేయడంలో సహాయ పడటంతో దంత సంరక్షణ ప్రయాణంలో ప్రతి అడుగు ద్వారా అత్యంత స్పష్టతను అందించడం దీని లక్ష్యం. ఈ డెంటల్ కేర్ స్టార్టప్ అనేక నెలల మేధోమథనం తర్వాత అధికారికంగా డెజీ అనే పేరును స్వీకరించింది. ఇది దంత సంరక్షణను సులభతరం చేసే యుగంలో ప్రభావవంతంగా ఉంటుందని భావించింది. స్మైల్స్.ఎఐ నుండి గణనీయమైన మార్పు, కొత్త బ్రాండ్ పేరు దీనిని ఈ విభాగంలోని ఇతరులందరి నుండి దీన్నివేరు చేస్తుంది. ఇది నవయుగంలో వినూత్న మైన దంత సంరక్షణ ప్రదాతగా దాని పరిణామాన్ని సూచిస్తుంది. ఇది క్వాలిఫైడ్ స్పెషలిస్ట్‌లు, నాణ్యమైన చికిత్సను నిర్ధారించే అత్యుత్తమ డెంటిస్ట్రీ టూల్స్ ద్వారా కచ్చితమైన డెంటిస్ట్రీని నిర్ధా రించడానికి సైన్స్‌ ఆధారితమైన ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది. డెజీ అనేది దంత సంరక్షణ చుట్టూ ఉన్న భయం, తప్పుడు సమాచారం నుండి ఒక మార్పును సూచిస్తుంది. బ్రాండ్‌పై మరింత విశ్వాసం, నమ్మకాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.

ప్రతి కేసు ప్రత్యేకతను గుర్తించి, డెజీ తగిన చికిత్సలకు సమగ్ర పరిష్కారంగా పనిచేస్తుంది. దాని విస్తృతమైన నైపుణ్యం, అధిక అర్హత కలిగిన నిపుణుల బృందంతో డెజీ నాణ్యమైన ఉత్పత్తులను అందించడంలో భరోసాని స్తూ అగ్రశ్రేణి పరిశోధన, అభివృద్ధిని అందిస్తుంది. రీబ్రాండింగ్ ప్రయత్నాల ద్వారా తాజా బ్రాండ్ గుర్తింపును స్వీ కరించడం ద్వారా తిరుగులేని చికిత్స ప్రయాణాన్ని అందించడమే దీని లక్ష్యం. డెజీ ఇటీవల కస్టమర్ సౌలభ్యం, సంతృప్తికి ప్రాధాన్యతనిచ్చే అత్యాధునిక సిగ్నేచర్ క్లినిక్‌లను పరిచయం చేసింది. సాంకేతికతను ఉపయోగించు కోవడం ద్వారా, పారదర్శకతను మెరుగుపరచడం, వినియోగదారులకు వారి ప్రయాణంలో అడు గడుగునా స్పష్టమైన సమాచారాన్ని అందించడం డెజీ లక్ష్యం. ఈ సందర్భంగా డెజీ వ్యవస్థాపక భాగస్వామి (బ్రాండ్, గ్రోత్) ప్రశాంత వదన్ మాట్లాడుతూ, ‘‘దాదాపు ప్రతి నగరంలో ‘స్మైల్’ అనే కీవర్డ్‌ తో కూడిన డెంటల్ క్లినిక్ ఉంది. దీంతో, మా బ్రాండ్‌ను ఇతరుల నుండి వేరు చేయడానికి, మేం డెజీ అనే పేరును స్వీకరించాలని నిర్ణయించుకున్నాం. మేం అనేక ఎంపికలతో ముందుకు వచ్చినప్పటికీ, మేం డెజీ తప్ప మరే ఇతర పేరుతో మమ్మల్ని మేం ఒప్పించుకోలేకపోయాం. స్మైల్స్.ఏఐ
నుండి డెజీకి మారడం మాకు కష్టమేమీ కాదు – ఇది మా వెంచర్‌కి తదుపరి సహజమైన పురోగతి. అంతేగాకుండా, మేం మా స్మైల్స్.ఏఐ క్లయింట్ బేస్ అవసరాలను తీర్చడాన్ని కూడా కొనసాగిస్తాం” అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు