Saturday, July 27, 2024

ఉప్పల్ చిలుకానగర్, శ్రీ భక్తమార్కండేయ పద్మశాలిసహకార సంక్షేమ సంఘం సమావేశం..

తప్పక చదవండి

హైదరాబాద్, చిలుకానగర్ పద్మశాలి అడహాక్ కమిటీసభ్యులు పంచ పాండవులైన ఆడెపు అంజయ్య, దేవసాని బాలచందర్, గూడ శ్రీశైలం, సకినాల ప్రసాద్, పొట్టాబత్తిని నర్సింగరావు, ముఖ్య సలహాదారులు బోడవిద్యాసాగర్, పెండెం నాగార్జునలు అభినందనీయులు అన్నారు వక్తలు.. ఆదివారం ఉదయం 11:00 నుండి 1:30 గంటల వరకు చిలుకా నగర్ పద్మశాలి సహకార సంక్షేమ సంఘ సర్వసభ్య సమావేశం ఈస్ట్ కళ్యాణపురి కమిటీ హాల్లో అడహాక్ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహపూరిత వాతావరణంలో చైతన్యవంతంగా సాగినది.మార్కండేయ మహర్షి, కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటాలకు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అడహాక్ కమిటీ సభ్యులు ఆడెపు అంజయ్య అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా మసన చెన్నప్ప పాల్గొన్నారు. విశిష్ట అతిధులుగా… వనం శాంతికుమార్, గడ్డం వెంకటేశ్వర్లు, వేముల బాలరాజు, రాపోలు జ్ఞానేశ్వర్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అడహాక్ కమిటీ సభ్యులు ఆడెపు అంజయ్య, దేవసాని బాలచందర్, గూడ శ్రీశైలం, సకినాల ప్రసాద్, పొట్టాబత్తిని నర్సింగ రావు, ముఖ్య సలహా దారులు బోడ విద్యాసాగర్, పెండెం నాగార్జున వేదికను అలంకరించారు.

- Advertisement -

ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలు అందరు కూడా నిస్తేజంగా నిశ్శబ్దంగా ఉన్న చిలుకా నగర్ శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సహకార సంక్షేమ సంఘం చైతన్యమై క్రియాశీలకంగా పని చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు. పద్మశాలీల ఐక్యత కోసం అందరూ కృషి చేయాలని, ఒకరి కోసం అందరు, అందరి కోసం ఒక్కరు అనే రీతిలో పనిచేస్తూ పద్మశాలీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో రాణించాలని, అందుకు రాష్ట్రంలో ఉన్న పద్మశాలీలు అందరూ ఒక సంఘంగా ఏర్పడాలని, పద్మశాలీయులకు రాష్ట్ర స్థాయిలో ఒకే సంఘం ఉండాలని, అలాగే పద్మశాలీలతో పాటు 18 చేనేత కులాలతో ఏకమై మమేకమై ఆల్
ఇండియా వీవర్స్ ఫెడరేషన్ లో భాగస్వామ్యమై రాష్ట్ర, జాతీయ స్థాయిలో సకల రంగాలలో సమన్యాయం సాధించాలని, చేనేత కళను పరిరక్షించుకోవాలని, చేనేత కళాకారులకు, యితర వృత్తుల్లో ఉన్న చేనేత కులాల వారికి మెరుగైన జీవనం కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిలుకా నగర్ డివిజన్ పద్మశాలీయులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు