Monday, May 20, 2024

టమాటా ధరలకు కళ్లెం..

తప్పక చదవండి
  • రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం..
  • టమాటా పండే రాష్ట్రాలనుడి కొనుగోలు..
  • ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు సరఫరా..
  • జాతీయ సహకార వినియోగ దారుల సమాఖ్యకు ఆదేశాలు..
  • త్వరలోనే టమాటా ధర అదుపులోకి వసుందన్న కేంద్రం..

న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా టమాటా ధరలు తారాస్థాయికి చేరుకోవడంతో టమాటా ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. టమాటా విస్తృతంగా పండించే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వాటిని కొనుగులు చేసి, ధరలు ఎక్కువ ఉండే ప్రాంతాల్లో పంపిణీ చేయాలని జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య, జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్యలను ఆదేశించింది. శుక్రవారం నాటికి ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో వినియోగదారులకు అందుబాటు ధరల్లో టమాటాలు లభిస్తాయని ఆహార మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. టమాటా పంటను ఇండియాలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ పండిస్తుంటారు. ముఖ్యంగా దక్షిణ, పశ్చమ ప్రాంతాల నుంచే 56-58 శాతం పంట వస్తుంది. ఇక్కడ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు సరాఫరా అవుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరిలో పంట విస్తారంగా పండుతుంటుంది. జూలై-ఆగస్టు, అక్టోబర్-నవంబర్ మాసాలు టమాటా పంటకు అంతగా అనుకూలం కావు. ఈ మాసాల్లో పంట ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. కాగా, ఆయా సీజన్లకు అనుగుణంగా టమాటా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుంటాయి. వాతావరణ ప్రతికూలతల కారణంగా సరఫరాకు అంతరాయాలు, పంట దెబ్బతినడం వంటివి తలెత్తినప్పుడు అకస్మాత్తుగా ధరలు చుక్కలనంటుతాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం ఈసారి పంటను దెబ్బతీసినట్టు కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం గుజరాత్, మధ్యప్రదేశ్, తదితర రాష్ట్రాల నుంచి మార్కెట్లకు టమాటా సరఫరా జరుగుతోందని, మహారాష్ట్రలోని సతారా, నారాయణగావ్, నాసిక్ నుంచి నెలాఖరుల కొత్త పంట వచ్చే అవకాశం ఉందని చెబుతోంది. దీంతో త్వరలోనే టమాటా ధరలు సాధారణ స్థాయికి వస్తాయని అంటోంది. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో టమాటో రిటైల్ ధర రూ.100 నుంచి 250 వరకూ పలుకుతోంది

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు