Saturday, May 18, 2024

త్వరలో టీటీడీ వెబ్‌సైట్‌లో రీఫండ్‌ ట్రాకర్‌

తప్పక చదవండి

తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్‌కు సంబంధించిన సమాచారాన్ని ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపుతున్నా మని, త్వరలో రీఫండ్‌ను ట్రాక్‌ చేసేందుకు టీటీడీ వెబ్‌సెట్‌లో ట్రాక్‌ర్‌ను పొందుపరుస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ స్పీడ్‌ పోస్టు చేసినపుడు ఏవిధంగా కవర్‌ను ట్రాక్‌ చేయవచ్చో అదే తరహాలో రీఫండ్‌ సొమ్ము సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు. తిరుమలలో యుపిఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు వారు గదులు ఖాళీ చేసిన వెంటనే కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ చేయడం జరుగుతోందని చెప్పారు. క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డు ద్వారా చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు 3 నుంచి 5 పనిదినాలలోపు వారి ఖాతాలకు కాషన్‌ డిపాజిట్‌ మొత్తం జమ చేస్తన్నామని తెలిపారు. ఈ సమాచారం ధ్రువీకరిం చుకోకుండా కొందరు భక్తులు కాల్‌ సెంటర్లకు ఫోన్లు చేసి, అధికారులకు మెయిళ్లు పంపుతున్నారని, భక్తులు తమ బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను పరిశీలించుకుని కాషన్‌ డిపాజిట్‌ మొత్తం రీఫండ్‌ కాకపోతేనే సంప్రదించాలని కోరారు. రీఫండ్‌ కోసం కొందరు భక్తులు సొమ్ము చెల్లించిన బ్యాంకును కాకుండా మరో బ్యాంకు స్టేట్‌మెంట్‌ను తప్పుగా సరిచూసుకుంటున్నారని, ఎస్‌ఎంఎస్‌లో సూచించిన విధంగా 3 నుండి 5 రోజులు వేచి ఉండడం లేదని వివరించారు. మరికొందరు టీటీడీ నిబంధనల ప్రకారం గది ఖాళీ చేయడం లేదని, వెరిఫికేషన్‌ కోడ్‌ సబ్‌మిట్‌ చేయకపోవడం, ఫొటో సరిపోలకపోవడంతో రీఫండ్‌ జనరేట్‌ కావడం లేదని చెప్పారు. ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు శ్రీవారి ఆలయం లో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయం లో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగు తుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీ యకుండా ఆగమ శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమల లో 1516 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలు న్నాయి. 1962వ సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించిందన్నారు. సిఆర్‌ఓలో లక్కీడిప్‌ ద్వారా ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు జూలై 19వ తేదీ నుండి ప్రయోగాత్మ కంగా ఎస్‌ఎంఎస్‌ ద్వారా పేలింక్‌ పంపుతున్నాం. భక్తులు తిరిగి కౌంటరు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నెట్‌ బ్యాంకింగ్‌ లేదా యుపిఐ లేదా క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా ఆన్‌లైనైన్‌లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్‌ తీసుకోవచ్చ న్నారు. త్వరలో ఎంబీసీ34 కౌంటర్‌ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్‌ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు చేస్తామన్నారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైపులైన్ల మరమ్మ తులు, సివిల్‌ పనులు చేపట్టేందుకు ఆగస్టు 1 నుండి పుష్కరిణిని మూసివేశాం. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల ముందు ఈ పను లు చేయడం ఆనవాయితీ. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు పుణ్య స్నానాలు చేసేం దుకు వీలుగా పుష్కరిణి పైభాగం లో షవర్లు ఏర్పాటుచేశాం. భక్తులు వీటిని వినియోగించు కోవాలని కోరుతు న్నామని అన్నారు. తిరుపతి జిల్లాను క్యాన్సర్‌ రహితప్రాంతంగా తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామూహిక క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కార్యక్రమానికి టీటీడీ సంపూర్ణ సహకారం అందిస్తోంది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు క్యాన్సర్‌ పరీక్షలు ఉచితంగా నిర్వహించడం కోసం ఒక పింక్‌ బస్సును ఆధునిక వైద్య పరికరాలతో జిల్లా యంత్రాం గానికి విరా ళంగా అంది స్తాం. అలాగే, గూడురు, చంద్రగిరి, శ్రీకాళహస్తిల్లో క్యాన్సర్‌ నిర్దారిత కేంద్రాలకు మరో పింక్‌ బస్‌ అందించడానికి ప్రయ త్నాలు జరుగుతున్నాయి. అలాగే స్విమ్స్‌లో మరో పింక్‌ బస్‌ ఏర్పాటు చేస్తాం. టాటా క్యాన్సర్‌ ఆసుపత్రికి కూడా ఒక పింక్‌ బస్‌ అందిస్తామని అన్నారు. స్విమ్స్‌లో త్వరలో లివర్‌ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అలాగే స్విమ్స్‌ సర్జికల్‌ గ్యాస్టో ఎంటరాలజీ విభాగం రాష్ట్రంలో మరెక్కడా లేని హెచ్‌పిబి(హెపటో పాంక్రియాటో బిలియరీ) సర్టిఫికేట్‌ కోర్సును నిర్వహిస్తోంది. ఎయిమ్స్‌ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో సూపర్‌ స్పెషాలిటీ గ్యాస్టో ఎంటరాలజీ చదువుతున్న ఫైనైలియర్‌ విద్యార్థులు ఈ కోర్సును అభ్యసిస్తున్నారు. 50 సీట్లు ఉన్నాయి. వీరికి ప్రముఖ వైద్యులతో శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడిరచారు. లోకక్షేమం కోసం వారణాశిలో జూలై 28 నుంచి ఆగష్టు 3వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస చతుర్వేద హవనం కార్యక్రమం నిర్వహించాం. ఏడు రోజుల పాటు రుత్వికులు నాలుగు వేదాల్లోని అన్ని మంత్రాలను పఠించి యజ్ఞేశ్వరునికి సమర్పణ చేశారు.తిరుమల నాదనీ రాజనం వేదికపై జరుగు తున్న మహాభారత ప్రవచనాల్లో భాగంగా జూలై 23న సభాపర్వం ముగిసింది. జూలై 24 నుండి అరణ్యపర్వ పారాయణం ప్రారం భమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల కోసం ఎస్వీబీసీ ప్రతి రోజూ రాత్రి 8 నుండి 9 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. వ్యాస మహర్షి రచించిన మహాభారతంలోని ప్రతి శ్లోకాన్ని భక్తులందరితో పలికించాలనే ఉద్దేశంతో ఈ పారాయణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.టీటీడీ విద్యా విభాగం ఆధ్వర్యంలో తిరుమల ఘాట్‌ రోడ్లు, నడకమార్గాల్లో ఆగస్టు 12వ తేదీన శుద్ధ తిరుమలసుందర తిరుమల కార్యక్రమం నిర్వహి స్తాం. తిరుపతిలోని అన్ని టీటీడీ కళాశాలలకు చెందిన ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు, అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తిరుమల పవిత్రతను, పరిశుభ్రతను కాపాడడానికి విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయం. మొదటి విడతగా ఈ ఏడాది మే 13న ఈ కార్యక్రమం నిర్వహించాం. తిరుమలతిరుపతి మధ్య నడిచే ఆర్‌టిసి బస్సుల్లోను, నడకమార్గాల్లోను ఏర్పాటుచేసిన డస్ట్‌బిన్ల లోనే భక్తులు ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను వేసి తిరుమలలో పచ్చ దనాన్ని, పవిత్రతను కాపాడేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఆగస్టు 25న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆల యంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా నిర్వహిస్తాం. ఈ సందర్భం గా అమ్మవారు స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఇ`2 జగదీశ్వర్‌రెడ్డి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ శ్రీదేవి, విజివో బాలిరెడ్డి, డెప్యూటీ ఈవోలు భాస్కర్‌, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు