Friday, May 17, 2024

రైల్వే విధుల్లో చేరిన రెజ్ల‌ర్లు..

తప్పక చదవండి

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడిని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆందోళ‌న చేప‌డుతున్న టాప్ రెజ్ల‌ర్లు మ‌ళ్లీ విధుల్లోకి చేరిన‌ట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ‌కు చెందిన ఓఎస్డీ పోస్టుల్లో సాక్షీ మాలిక్‌, పూనియా మ‌ళ్లీ చేరారు. శ‌నివారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మ‌హిళా రెజ్ల‌ర్లు భేటీ అయిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల జంత‌ర్ మంత‌ర్ నుంచి రెజ్ల‌ర్ల‌ను గెంటేశారు. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూష‌ణ్ లైంగిక వేధించిన‌ట్లు రెజ్ల‌ర్లు ఆరోపించారు. ఆయ‌న్ను త‌క్ష‌ణ‌మే అరెస్టు చేయాల‌ని సాక్షీ మాలిక్‌తో పాటు ప‌లువురు రెజ్ల‌ర్లు ఆందోళ‌న చేప‌ట్టారు. కేంద్ర ప్ర‌భుత్వం త‌మ మొర‌ను ఆల‌కించ‌క‌పోవ‌డంతో.. రెజ్ల‌ర్లు త‌మ ప‌త‌కాల‌ను గంగా న‌దిలో నిమజ్జ‌నం చేయాల‌నుకున్నారు. అయితే రైతు నేత టికాయ‌త్ జోక్యం చేసుకోవ‌డంతో ఆ కార్య‌క్ర‌మాన్ని ర‌ద్దు చేశారు.

ఆందోళ‌న విర‌మించినట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను సాక్షీ మాలిక్ కొట్టిపారేశారు. త‌ప్పుడు వార్త‌లు ప్ర‌సారం అవుతున్న‌ట్లు ఆమె తెలిపారు. న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం ఆగ‌దు అని సాక్షీ మాలిక్ ఇవాళ‌ త‌న ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించారు. రైల్వే ఉద్యోగ బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తిస్తున్నాన‌ని, కానీ న్యాయం దొరికే వ‌ర‌కు పోరాటం చేస్తూనే ఉంటామ‌న్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు