Sunday, October 6, 2024
spot_img

ఓజీలో వకీల్‌సాబ్‌ యాక్టర్‌..

తప్పక చదవండి

టాలీవుడ్‌లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్‌ యాక్టర్లలో ఒకరు శ్రీకాంత్‌ అయ్యంగార్. ఓ వైపు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, మరోవైపు నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హైదరాబాదీ నటుడు పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ నటించిన వకీల్‌సాబ్‌లో సీఐ యుగంధర్‌గా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పవన్‌ కల్యాణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు శ్రీకాంత్ అయ్యంగార్‌. సుజిత్ డైరెక్షన్‌లో టైటిల్‌ పోషిస్తున్న ఓజీ షూటింగ్ మూడో షెడ్యూల్ హైదరాబాద్‌లో షురూ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సుజిత్‌తో దిగిన సెల్ఫీ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సారి శ్రీకాంత్‌ అయ్యంగార్‌ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ఎస్ థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు.

యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఓజీలో గ్యాంగ్‌లీడర్‌ ఫేం ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ ఫీ మేల్ లీడ్ రోల్స్‌ లో నటిస్తున్నారు. ఇప్పటికే ముంబై, పూణే షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది ఓజీ. పవన్‌ కల్యాణ్‌ మరోవైపు ఉస్తాద్ భగత్‌సింగ్‌ సినిమాలో కూడా నటిస్తుండగా.. షూటింగ్‌ దశలో ఉంది. దీంతోపాటు క్రిష్‌ డైరెక్షన్‌లో హరిహరవీరమల్లు, సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాల్లో నటిస్తున్నాడు పవన్‌ కల్యాణ్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు