ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం టీమిండియా ప్లేయర్లు ధరించే కొత్త జెర్సీ(Test Jersey)లను రిలీజ్ చేశారు. అడిడాస్ కంపెనీతో భాగస్వామ్యంలో భాగంగా ఆ కొత్త జెర్సీలను డిజైన్ చేశారు. టెస్టు జెర్సీలను ధరించిన టీమిండియా క్రికెటర్ల ఫోటోలను ఇవాళ బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఓవల్‌లో జరగనున్న మ్యాచ్ సమయంలో ఇండియన్ క్రికెటర్లు ఈ జెర్సీల్లో కనిపిస్తారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, గిల్; జడేజాతో పాటు ఇతర ఆటగాళ్ల ఫోటోలను రిలీజ్ చేశారు.