Thursday, September 12, 2024
spot_img

వర్షంతో రోడ్లు చిద్రం..

తప్పక చదవండి
  • నీటి కాలువలను తలపిస్తున్న యాచారం
  • నందివనపర్తి రోడ్డు
  • చిన్నపాటి వర్షం పడినా చిత్తడే
  • ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు
  • పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు
    ఇబ్రహీంపట్నం : చిన్నపాటి వర్షం పడితే చాలు యాచారం నుంచి నందివనపర్తి కి వెళ్ళే రోడ్లు కుంటలను తలపిస్తున్నాయి. కొన్ని రోడ్లయితే ఏకంగా చెరువుల్లా కూడా దర్శనమిస్తున్నాయి. బురద లో రోడ్లన్ని చిత్తడి చిత్తడిగా మారుతున్నాయి. ఆ గ్రామీణ రోడ్లల్లో ప్రయాణించాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాచారం నుంచి కందుకూరు వెళ్ళే ప్రధాన రోడ్డు ఇంత అధ్వానంగా మారింది. యాచారం గ్రామానికి వచ్చే రోడ్లలో నందివనపర్తి కి వెళ్ళే రోడ్డు అత్యంత రద్దీగా ఉంటుంది. అలాంటి రోడ్డును పట్టించుకోవడం లో అదికారులు విఫల మయ్యారు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు ఆ రోడ్లవైపు కన్నెత్తి చూడకపోగా మరికొన్ని ప్రాంతాల్లో తత్కాలిక చర్యలు మాత్రమే చేపడుతుండటంతో కొన్ని రోజులకే మళ్లీ రోడ్లు కుంటలుగా మారిపోతు న్నాయి. ఈ రోడ్ల గుండా ప్రయాణించాలంటే ద్విచక్రవాహనదారులు, పాదచారులు నానా ఇబ్బందలు పడుతున్నారు. అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. గుంతల్లో నీరు నిల్వ పడితే దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. దాంతో విషజ్వరాలు ప్రబలి ఆస్పత్రుల పాలవుతున్నారు. వైద్య నిమిత్తం కోసం బయటికి రావాలన్నా పిల్లలు చదువులకు వెళ్లాలన్న నీటిలో నడవాల్సిందే. దాంతో ఆ గ్రామంలో వర్షం పడితే ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామానికి చెందిన పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కొద్దిపాటి వర్షం కురిసినా గ్రామంలోకి వెళ్లేందుకు చాలా కష్టతరంగా మారింది. ఇకనైనా పంచాయతీ అధికారులు, పాలకులు స్పందించి రోడ్డు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఏదేమైనా రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
    రోడ్డు మరమత్తులు చేయండి
    : చెట్టిమల్ల శ్రీకాంత్‌, నందివనపర్తి గ్రామస్తుడు
    యాచారం నుంచి నందివనపర్తి గ్రామానికి వెళ్ళే దారిపై భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్డు గుంతల మయం అయ్యాయి. దీంతో వర్షం కురిసిన రోజు గుంతల్లో నీరు చేరి గుంతలు మునిగిపోయాయి. అంతేకాకుండా రోడ్డు మధ్యలో చిన్న , చిన్న కంకర తేలింది. బైక్‌ పై వెళ్ళే వారు స్కిడ్‌ అయ్యి కింద పడి గాయాల పాలవుతున్నారు. అధికారులు తక్షణమే పట్టించుకోని రోడ్డు మరమత్తులు చేపట్టాలి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు