Tuesday, May 14, 2024

ఇది చెరువు కాదు..బండాపోతుగల్‌ బడి బాట

తప్పక చదవండి
  • నిండు కుండలా మారిన రెండవ వీధి సీసీ రోడ్డు..
  • పత్రికల్లో కథనాలు ప్రచురించిన తీరుమార్చుకోని పాలకవర్గం..
  • ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగానే పాలకవర్గం పనితీరు..
  • రెండవ వార్డులో ఇండ్లలోకి చేరిన వర్షపు నీరు..
  • కాలనీవాసులు మొర పెట్టుకున్నా నేనేం చేయాలి అంటున్న సర్పంచ్‌..
  • మూడు నెలలుగా చెప్తున్నా పట్టించుకోవడం లేదంటున్న బాధితులు.
  • పై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్న కాలనీవాసులు..
  • లేనియెడల జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయిస్తామని హెచ్చరిక..

చిలిపిచేడ్‌:పల్లె ప్రగతితో పల్లెలన్నీ పట్టణాలను తలపిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి వరుసగా ఆవార్డులు అందుకుంటుంటే.. అదంతా ఉత్తుత్తి మాటలే అన్నట్లుగా చిలిపిచేడ్‌ మండలం బండాపోతుగల్‌ గ్రామంలో పాలకవర్గం పనితీరే నిదర్శనమంటున్నారు గ్రామస్తులు.బండాపోతుగల్‌ పాలకవర్గం నిర్లక్ష్యం శీర్శికన గతనెల జూన్‌28న ఆదాబ్‌ హైదరాబాద్‌ కథనం ప్రచురించగా స్పందించిన గ్రామ పరిపాలన అధికారులు, సర్పంచ్‌ త్వరలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఈ గ్రామంలోకి వెళ్లాలంటే మీరు చెరువులో నుండి వేలాల్సిందేనండోయ్‌ అంటున్నారు స్థానికులు.చెరువు అంటే నిజంగా చెరువు కాదండోయ్‌ ఇక్కడ వర్షం పడిరదా బీటీ రోడ్డే చెరువుల తయారవుతుంది.చిన్నపాటి వర్షానికే పెద్ద చెరువును తలపిస్తుంది.ఇది మరెక్కడో కాదు చిలిపిచేడ్‌ మండలంలోని మా బండాపోతుగల్‌ గ్రామంలోని దుస్థితి అని, పాఠశాల ముందున్న బీటీ రోడ్డు వర్షం పడిరదా మొత్తం చెరువుగా మారిపోతుందని వాపోతున్నారు గ్రామస్తులు.వర్షపు నీరు ఎక్కడ వెళ్లకుండా రోడ్డుపైనే ఉండడంతో పాఠశాలకు వెళ్లే విద్యార్థులు,గ్రామంలోకి వెళ్లే గ్రామస్తులు,ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు.గ్రామ పంచాయతీ పాలకవర్గం పని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు గ్రామస్తులు.వర్షపు నీరుతో చెరువును తలపిస్తున్న పంచాయతీ పాలకవర్గం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం విడ్డూరంగా ఉంది.అలాగే ఎన్ని సార్లు పేపర్లలో వచ్చిన పంచాయతీ పాలకవర్గం పేడ చెవిన పెట్టడం గమనార్హం.పై అధికారులకు చెప్పిన పట్టించుకోకపోవడం వలన జిల్లా కలెక్టర్‌ కి పిర్యాదు చేస్తామంటున్నారు గ్రామస్తులు. చిలిపిచేడ్‌ మండలం లోని బండాపోతుగల్‌ 2వార్డులోని సీసీ రోడ్డు చెరువును తలిపిస్తు న్నది.పాలకవర్గ నిర్లక్ష్యానికి కాలనీవాసుల అవస్థలు ఉదయం నుండి విపరీతంగా కురుస్తున్న వర్షానికి సీసీ రోడ్డు పై నుండి నీరు కాల నీవాసులు ఇండ్లలోకి చేరడంతో కాలనీ వాసులు నానా అవ స్థలు పడుతున్నారు.ఎవరికీ చెప్పుకోవాలో అర్ధం కాకా తల పట్టు కుంటున్నారు.బాధితులు సర్పంచును, కార్య దర్శిని సంప్రదించిన మేము ఎం చేయాలనీ చేతులెతేయడంతో ఇంకా ఎవరికీ మా గోడును చెప్పాలని, పట్టించుకునేవారే లేరని వాపోతున్నారు.
బాధితుడు తలారి దశరథ్‌ వివరణ..
చిన్నపాటి వర్షాలకే మా ఇంటి పక్కన ఉన్న సీసీ రోడ్డుపై నీరు నిలువగా ఉంటుంది.ఆ సమస్యను పరిస్కరించామని అడిగిన ఎవరు పట్టించుకోవడం లేదు.నిన్న కురిసిన వర్షానికి వర్షపు నీరు ఇంట్లోకి వచ్చి చేరింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.లేని యెడల జిల్లా కలెక్టర్‌ కు ఫిర్యాదు చేస్తాను అని బాధితుడు చెప్పాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు