- అచ్చునూరి కిషన్, తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ.
హైదరాబాద్ : ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఐ.టి., మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈ మధ్య కాలంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, అందుకుంటూ అభివృద్ధి లో ముందుకు వెళ్తుంది. కానీ ప్రక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం లో పూర్తిగా విఫలమైంది అని చేసిన ఆరోపణలను స్వీకరించిన… “ప్రజా గొంతుక, క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న, టీమ్” ఈ నెల 14, 15,న ఛలో ఛత్తీస్గఢ్ కు పిలుపునిచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల్లో పది బస్సులను ఏర్పాటు చేసి 500 మంది రైతులను తీసుకొని బయలుదేరి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం రైతులకు ఏవిధమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందో స్వయంగా అక్కడి రైతులతో మాట్లాడుతూ వారి వ్యవసాయ క్షేత్రంలో వారు ఉత్పత్తి చేస్తున్న విధానాన్ని చూసి అవాక్కయిన తెలంగాణ రైతులు.!
తెలంగాణ లో కన్న ఇక్కడె రైతుల పరిస్థితి 100 శాతం మెరుగు ఉందని చెప్పకనే చెప్పారు. తర్వాత ఛత్తీస్గఢ్ రైతులు, తెలంగాణ రైతులు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రైతాంగానికి చెపట్టే అభివృద్ధి పై చర్చించుకొని ఛత్తీస్గఢ్ ప్రభుత్వ’మే మెరుగైంది అని కీర్తించిన తెలంగాణ రైతులు.! అలాగే ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న నేతృత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు రజినీ కుమార్ ఆధ్వర్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి స్వయంగా తెలంగాణ రైతులను తీసుకువెళ్ళి ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్’జీ తో మాట ముచ్చట నిర్వహించి ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేరుగా “సీఎం భూపేష్ భఘేల్'” వివరించారు. సీఎం మాటలకు, తెలంగాణ రైతులు ఫిదా కావడం జరిగింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతులకు ఏవిధమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అందుకుంటుందో, తెలంగాణలో కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రైతులు ఇక్కడి బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రెండు రోజుల ఛత్తీస్గఢ్ పర్యటనను విజయవంతం చేసిన తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా అధ్యక్షులకు, ప్రధాన కార్యదర్శులకు, టీమ్ సభ్యులకు, రైతులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.