Wednesday, May 22, 2024

పుడమి తల్లికి సతత హరిత హారం నేడు తెలంగాణ మణిహారం..

తప్పక చదవండి

హైదరాబాద్, పుడమి తల్లికీ చల్లగా సతత హరితహారం నేడు తెలంగాణా మణి హారం అన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్, బీ.ఆర్.ఎస్. రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం గుండ్రాతి శారదాగౌడ్.. తెలంగాణాలో పచ్చదనం, భూగర్భ జలాలు పెరిగినాయి అంటే కెసిఆర్ దూరదృష్టి.. 273 కోట్ల మొక్కలు నాటడం, 12 లక్షల 63 వేల ఎకరాల అడవుల పునరుద్దరణ.. 179 అర్బన్ ఫారెస్ట్ పార్కులు, 19,472 పల్లె ప్రకృతి వనాలు, అంతే కాదు 8శాతం పచ్చదనం తెలంగాణా రాష్ట్రంలో పెరిగింది అని ధ్రువీకరించిన ఫారెస్ట్ ఆఫ్ ఇండియా అన్నారు.. తెలంగాణాకు పచ్చలహారం.. అడుగడుగునా ఆహ్లాదం హరితహారం అన్నారు శారదాగౌడ్.. ఈ కార్యక్రమంలో శోభ, ప్రతిభ, లక్ష్మి, ఎల్లమ్మ, రాణి పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు