Saturday, May 4, 2024

విద్యార్థులందరికీ సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన బీసీ సంక్షేమ సంఘం..
    హైదరాబాద్, ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ కళాశాలలకు వెళ్ళే విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగానే ఇంటినుండి కళాశాలలకు వచ్చే విద్యార్థులకు సమాన స్కాలర్ షిప్ వర్తింప చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్ లు బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బూర వెంకటేష్ గౌడ్ కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా విద్యార్థుల సమస్యను వారికి వివరిస్తూ.. ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఉచిత వసతి కల్పిస్తూ వారికి భోజన ఖర్చుల నిమిత్తం ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం 1500 రూపాయలు ఖర్చు చేస్తుందని అన్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు మాత్రం 500 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తుందని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయం, కూలి పనికి వెళ్ళే వారి పిల్లలు ఉదయం సరియైన తిండి తినక కళాశాలలకు వస్తారని వీరికి ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయలు బస్ పాస్ కు మాత్రమే సరిపోతాయని, మధ్యాహ్నం భోజనానికి డబ్బులు లేక విద్యార్థులు సగం పూట మాత్రమే తరగతులు విని ఇంటికి వెళతారని.. దీనివల్ల విద్యార్థులు చదువులో వెనుక బడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు నెలకు 2000 రూపాయలు స్కాలర్ షిప్ చెల్లించాలని ప్రిన్సిపాల్ సెక్రెటరీని కోరారు. ప్రిన్సిపాల్ సెక్రెటరీ బూర వెంకటేష్ గౌడ్ సమస్యపై సానుకూలంగా స్పందిస్తూ.. ముఖ్యమంత్రికి వివరించి విద్యార్థులకు న్యాయం చేస్తానని తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు