Wednesday, May 1, 2024

అమెరికాకు వెళ్లనున్న భారత ప్రధాని మోడీ..

తప్పక చదవండి

న్యూ ఢిల్లీ, భార‌త ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు అమెరికాలో అధికార పర్యటన జరపనున్న సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలకడానికి భారతీయ అమెరికన్లు సమాయత్తమవుతున్నా రు. అమెరికా న్యూయార్క్ లో ఉన్న ప్రసిద్ధి గాంచిన టైం స్క్వేర్ వద్ద “ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ” ఆధ్వర్యములో మోడీకి స్వాగతం అంటూ పెద్ద ఎత్తున ప్రదర్శన కార్యక్రమాలు చేపట్టారు.. ఈ విధముగా అమెరికాలో 20 పట్టణాలలో వివిధ ప్రసిద్ధి గాంచిన స్థలాల్లో చేపట్టి మంగళవారం మోడీ న్యూయార్క్ వచ్చి జూన్ 21 వ రోజు యోగ దినోత్సవ కార్యకమంలో పాల్గొంటారు .. తర్వాత మోదీకి వైట్‌హౌస్‌లో 22న అధ్యక్ష దంపతులు గౌరవ విందు ఇస్తారు. మోదీ యాత్ర కోసం యావత్ భారతీయ అమెరికన్ సమాజం ఉత్సాహంగా ఎదురుచూస్తోందని అడపా ప్రసాద్ చెప్పారు. జూన్ 21న మోదీ విమానం దిగే వైమానిక స్థావరం వద్దకు వెళ్లి స్వాగతం చెప్పడానికి భారతీయ అమెరికన్లు సిద్ధమవుతున్నారు అని కృష్ణా రెడ్డి ఏనుగుల, విలాస్ జంబుల తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు