- గాలికొదిలేసిన గంగారం పాలకవర్గం..
- పసలేని పల్లె ప్రకృతి వనం..
- పత్తాలేని గంగారం పాలకవర్గం..
- కోట్లాది రూపాయలు కాంట్రాక్టుల పరం..
- పనికిరాని నిర్మాణాలు ప్రజావసరాలకు దూరం..
- గాలివానకు గల్లైంతైన వైకుంఠధామం..
- నెలలు గడుస్తున్నా నిర్లక్ష్యంపై చర్యలు శూన్యం..
- ఉన్నతాధికారులు ఉన్నారా? లేరా?..
- గంగారం నాసిరకం వైకుంఠధామంపై చర్యలేవి..?
చిలిపిచేడ్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పల్లెలు పచ్చధనంతో వెల్లివిరుస్తున్నాయని ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది..క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగానే పాలకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజావ్యతిరేకతకు తావిస్తుంది.చిలిపిచేడ్ మండలం గంగారం గ్రామంలో గత నెల రోజుల క్రితం గాలి వానకు గల్లైంతైన నాసిరకం వైకుంఠధామం నిర్మాణమే నిదర్శనమంటున్నారు స్థానిక విద్యావంతులు.పల్లె ప్రకృతి పనుల్లో నాణ్యత లేకపోవడం వలన గంగా రం గ్రామంలోని వైకుంఠధామం చిన్నపాటి గాలివానకే రేకులు,పైపులతో సహా గాలికి ఎగిరిపోవడం, గదుల గోడలు పెచ్చులు ఊడిపోయి పగులుపడిన పరిస్థితిపై ఆదాబ్ హైదరాబాద్ నెలరోజుల క్రితం పసలేని పల్లెప్రకృతివనం శీర్షికన వార్తను ప్రచురించినది.అయినా అధికారుల జాడే లేదని గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గాలికి ఎరిగిపోయిన రేకుల గదిని,పగుళ్లు వచ్చి గోడలు బీటలు బారినప్పటికి,నెలలు గడుస్తున్నా నిర్మాణాలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతు న్నాయి అంటున్నారు గ్రామస్తులు. నిర్మాణాలు జరుగుతున్న సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే దీనికి నిదర్శనమని,లక్షల రూపాయలు వెచ్చించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా నిర్మించాలని ఆదేశించిన అధికారుల అండదండలతో నాణ్యత లేని కట్టడాలు కట్టి కాం ట్రాక్టర్లు లక్షల రూపాయలను కాజేశారని ఆరోపణలు గంగారంలో గుప్పుమం టున్నాయి. అయినా ఉలుకుపలుకు లేకుండా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని లేని యెడల జిల్లా అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని స్థానికులు హెచ్చరించారు.
ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే నాణ్యత లోపలకు కారణమంటున్న గ్రామస్తులు.. పల్లెప్రకృతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణాలు గంగారం గ్రామంలో అప్పుడే నాణ్యత లోపాలు బయటపడ్డాయని,సంబంధిత అధికారులు పరిశీలిన లేకపోవడం దానికి కారణం.గ్రామంలోని వైకుంఠధామం నాణ్యత లోపాల వలన రేకులు ఎగిరిపోవడం,గోడలు బీటలువారి నెలలు గడుస్తున్నా పట్టించుకుపోవడం, అసలు సంబంధిత అధికారులు ఉన్నారా..?అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయలు కాజేసేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పనికిరాని నిర్మాణాలు నిర్మించారా..?
అని ప్రశ్నిస్తున్నారు.గ్రామీణ ప్రాంతాలను పట్టణాలకు ధీటుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీ ఆర్ కలలు కంటుంటే క్షేత్రస్థాయిలో మాత్రం పాలకవర్గాలు, అధికారులు కుమ్మక్కై కాసులకోసం కల్తీ కాంట్రాక్టర్లతో నిర్మాణాలు చేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు గంగారం గ్రామంలోని సామాజిక కార్యకర్తలు వెంటనే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. మరి గంగారం నాసిరకం వైకుంఠధామం వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే…