Tuesday, September 10, 2024
spot_img

పైప్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన సిపిఐ నేతలు

తప్పక చదవండి
  • మంచినీటి కష్టాలను తీర్చకపోతే మున్సిపాల్టీని ముట్టడిస్తాం

కొత్తగూడెం ప్రజల మంచినీటి కష్టాలను తీర్చకపోతే పెద్దఎత్తున మున్సిపాల్టీని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె. సావీరా | అన్నారు. కిన్నెరసాని నీటి సమస్యలపై జిల్లా సిపిఐ కార్యదర్శి ఆధ్వర్యంలో సిపిఐప్రతినిధి బృందం రేగళ్లకాల్వతండా వద్ద ఉన్న కిన్నెరసాని పంపును ఆదివారం సందర్శించారు. కిన్నెరసాని లీకేజీ పైపైన్ రిపేర్ పనులను వారు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో కిన్నెరసాని మంచినీళ్లు సరైన సరఫరా లేక నెలల తరబడి ప్రజలు నీటి కష్టాలను అనుభవిస్తున్నారన్నారు. మంచినీటి కష్టాలు తీర్చడంలో ప్రభుత్వం, అధికారయంత్రాంగం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజల మంచినీటి కష్టాలను తీర్చాల్సిన యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలను గాలికి వదిలేసి ప్రజల్ని నీటి కష్టాల్లో నెట్టేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగూడెం వ్యాప్తంగా వార్డుకు రెండు మినీ వాటర్ స్కీంలు గతంలో ఉండేవని అలాంటి మినీవాటర్ స్కీంలను రిపేరు చేయించకుండాగాలికి వదిలేయడంతో నేడు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. తక్షణమే అన్ని వార్డుల్లో ఉన్న మినీవాటర్స్కీంలు రిపేరుచేసి వార్డుకు రెండు చేతిపంపులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వై. శ్రీనివాస్ రెడ్డి, మాచర్ల శ్రీనివాస్, మునిగడప వెంకటేశ్వర్లు, బానోతు చందర్, శ్రీనివాస్, షాబుద్దీన్, నరేష్, కె. లక్ష్మీ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు