Saturday, July 27, 2024

ఖాబర్దార్ కౌశిక్ రెడ్డి.. కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్..

తప్పక చదవండి
  • ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం..
  • ముదిరాజుల జోలికొస్తే సహించేది లేదు..
  • చిలిపిచేడ్ మండల ముదిరాజ్ సంఘం

చిలిపిచేడ్, ఖబర్దార్ కౌసిక్ రెడ్డి ముదిరాజుల జోలికొస్తే సహించేది లేదని చిలిపిచేడ్ మండల ముదిరాజ్ సంఘం నాయకులు, యువకులు హెచ్చరించారు. ఆదివారం మండల కేంద్రమైన చిలిపిచేడ్ ప్రధాన కూడలి వద్ద పెద్ద ఎత్తున ముదిరాజ్ సంఘం నాయకులు యువకులు ఆందోళన చేసి ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఖబర్దార్ కౌశిక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్, కౌశిక్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలి, కౌశిక్ రెడ్డిపై వెంటనే కేసు నమోదు చేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం చిలిపిచేడ్ ఉప సర్పంచ్ హన్మంత్ మాట్లాడుతూ.. ముదిరాజ్ ల జోలికొస్తే శ్రీ బిడ్డా సహించేది లేదన్నారు. వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి కూడా కౌశిక్ రెడ్డిని బర్తరప్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతరం సోమక్కపేట సర్పంచ్ బెస్త లక్ష్మణ్ మాట్లాడుతూ.. పాడి కౌశిక్ ముదిరాజ్ ల పట్ల అంత నీచమైన పదజాలంతో దూషించడం మంచిది కాదు.కౌశిక్ రెడ్డిని వెంటనే ఎమ్మెల్సీ పదవి నుండి బర్తరఫ్ చేసి, పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. మళ్ళీ ఇలాంటి వ్యక్తులకు ఏ పార్టీలకు కూడా తీసుకున్నారు. ఒకవేళ పార్టీలలోకి తీసుకున్న కూడా బిడ్డా కౌశిక్ రెడ్డి నిన్ను బొందపెట్టడానికి
ముదిరాజ్ లు అంత రెడీగా ఉన్నారని ఆయన అన్నారు. అనంతరం నర్సాపూర్ మాజీ ఎంపీపీ రమణ మాట్లాడుతూ.. మా ఓట్లతో అందలం ఎక్కి మా ముదిరాజ్ లనే కించపరుస్తవా ముదిరాజ్ లం తలుచుకుంటే రోడ్డు మీద కూడా తిరగనియ్యం బిడ్డా అని హెచ్చరించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మాజీ ఎంపీపీ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
రమణ, ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు దశరథ్, ఉపాధ్యక్షుడు నర్సింలు, సోమక్కపేట సర్పంచ్ లక్ష్మణ్, రాందాస్ పల్లి సర్పంచ్ యాదగిరి, గౌతపూర్ సర్పంచ్ విట్టల్, చిలిపిచేడ్ ఉప సర్పంచ్ హన్మంత్, బండాపోతుగల్ ఉప సర్పంచ్ మాణిక్యం, సోసైటీ డైరెక్టర్ గంగాధర్,ప్రధాన కార్యదర్శి జనార్దన్, పెద్దలు, యువకులు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు