- దశాబ్ది ఉత్సవాల్లో దగాపడ్డ ప్రగతి వనాలు..
- లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో నెలకొల్పిన వైనం..
- వనాల బాగోగులు పట్టించుకునేది ఈవృ..?
- మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం..
- వీటి పేరుతో రూ. 22 లక్షలు బుగ్గిపాలు..
- ప్రజలకు అందుబాటులో లేని అధికారులు, ప్రజాప్రతినిధులు..
- వనాల్లో బర్రెలు, గొర్రెలు మేపుతున్న కాపర్లు..
దేవరకొండ మండలం, దేవరకొండ నియోజకవర్గం పరిధిలో లక్షలు ఖర్చుపెట్టి గ్రామాల్లో పల్లె ప్రగతి వనాలు నిర్మిస్తే.. వాటి బాగోగులు చూసే నాధుడే లేక పోయే.. తూర్పుపల్లి గ్రామంలో పాలనా వ్యవస్థ తుప్పుపట్టి పోయింది.. ఎటు చూసినా అవినీతి ఏరులై పారుతుంది అనడంలో సందేహమే లేదు.. దానికి ఉదాహరణ నేడు జరగబోయే దశాబ్ది ఉత్సవాల పల్లె ప్రగతి వనాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అత్యంత కీలకంగా మారిన ఉత్సవాలు. పల్లె ప్రగతి ఉత్సవాల్లో తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగపడ్డాయి అనే విధంగా ఉత్సవాలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, ఉన్న ఫలంగా ఆయా గ్రామాల, మండలాల అధికారులు వేడుకలు జరిపించడానికి ఉరుకులు పరుగులు తీస్తున్నారు.. ఉత్సవాలు జరుపుకునే గ్రామాల్లో పరిస్థితి ఒకసారి పరిశీలిస్తే.. తూర్పుపల్లి గ్రామం పరిధిలో పల్లె ప్రగతి వనం వద్దకు వెళ్లి చూడగా బర్రెల, గొర్రెల కాపర్లు పూర్తిగా వాటిని మేపి ఉన్న చెట్లు కాస్త విరిగిపోవడంతో.. అసలు చెట్లు లేని పల్లె ప్రగతి మైదానంగా మారి, తదనంతరం బూడిదగా మారిందని గ్రామ ప్రజలు బాధపడడం జరిగింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సుమారు రూ. 22 లక్షల పైచిలుకు పల్లె ప్రగతి వనాల పేరుతో ప్రభుత్వం గ్రామాల్లో వందరోజుల కూలీల డబ్బులను మట్టిలో పోసినట్టు అయిందని దానికి ఉదాహరణ ఈ పల్లె ప్రకృతి అని ప్రజలు వాపోయారు.. గ్రామాల్లో పరిపాలన గతంలోనే అటుకెక్కిందని వాటిని దించే పరిస్థితి లేదని, వాటిని దించే ఆలోచన చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో తక్షణమే ఈ ప్రభుత్వాన్ని దించడమే మనకున్న మొదటి ఆలోచన అని ప్రజలు తీవ్రంగా విమర్శించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామాల్లో నిర్మించినటువంటి డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు కాల గర్భంలో కలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నేటి గ్రామ మేధావులు వివరించారు. తూర్పుపల్లి గ్రామంతో పాటు దేవరకొండ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉందని దానికి ఉదాహరణ ఈ పల్లె ప్రగతి వనం ఒకటి అని అంటున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒకటై గ్రామాల్లో పరిపాలన అస్తవ్యస్తంగా మార్చే పనిలో ఉన్నారని.. వాటిని సరిచేసే ఆలోచన వారికి లేదని.. తక్షణమే ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలకు కోరుతున్నారు.