Sunday, May 19, 2024

ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఒక రోజు మొబైల్ సైన్స్ ప్రదర్శన..

తప్పక చదవండి
  • వివరాలు తెలిపిన ప్రో. హెచ్. సురేఖా రాణి.., హెడ్ అండ్ కో ఆర్డినేటర్..

జన్యుశాస్త్రం, బయోటెక్నాలజీ విభాగం బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ ఎ. భరత్ సహకారంతో జూలై 7న ఒక రోజు మొబైల్ సైన్స్ ప్రదర్శనను నిర్వహించింది. మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ థీం “జీన్ హెల్త్ కనెక్ట్” జన్యువులు, జన్యు రుగ్మతలు, నివారణ వ్యూహాలు.. చికిత్సపై అవగాహన కల్పించడం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలతో పాటు ఇతర అనుబంధ కళాశాలల నుంచి దాదాపు 300 మంది సభ్యులు సైన్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. ప్రొఫెసర్ బి. వీరయ్య, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ జయశ్రీ, వైస్ ప్రిన్సిపాల్, యుసిఎస్ అన్ని ప్రదర్శనలను ఆసక్తితో సందర్శించి, భవిష్యత్తులో కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడానికి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులను అభినందించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు