Friday, July 12, 2024

జూలై 11న శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు..

తప్పక చదవండి

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జూలై 11న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నేపథ్యంలో 11న బ్రేక్ దర్శనాల ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కారణంగా జూలై 10న సోమవారం సిఫారసు లేఖలు కూడా స్వీకరించబడవని ,ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారంఒకటో విడ‌త అయోధ్యకాండ అఖండ పారాయ‌ణం భక్తజనరంజకంగా జరిగింది. శ్రీ హనుమత్ సమేత సీతారామలక్ష్మణ ఉత్సవమూర్తుల సమక్షంలో ఆద్యంతం రామనామస్మరణతో సాగింది. ఇందులో ఒకటి నుంచి 3 సర్గల వ‌ర‌కు గ‌ల 156 శ్లోకాలను పారాయణం చేశారు. ధర్మగిరి వేద పాఠశాల పండితులు ఆచార్య రామానుజాచార్యులు అనంత గోపాల కృష్ణ, పివిఎన్ఎన్.మారుతి శ్లోక పారాయ‌ణం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు