Tuesday, June 18, 2024

రాంనగర్ లో మూసి నది..

తప్పక చదవండి
  • ముషీరాబాద్ జోన్ రాంనగర్ డివిజన్ వీ.ఎస్.టి. రోడ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుపై 365 రోజులు ప్రవహిస్తున్న డ్రైనేజీ వాటర్ మరమ్మతులు చేసి చర్యలు తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు.. ఈ సందర్భంగా భారతదేశ ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి జావేద్ మాట్లాడుతూ.. నిత్యం మూసి నదిలా పారుతున్న ఈ డ్రైనేజీని అధికారులు పట్టించుకోక పోవడంపై స్థానికులు, వాహనదారులు మండిపడుతున్నారు అన్నారు. గతంలో చాలాసార్లు జిహెచ్ఎంసి అధికారులకు, స్థానిక కార్పొరేటర్ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రతిరోజు దుర్వాసనతో స్థానికులు పక్కనే ఉన్న ఫైర్ స్టేషన్ సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. జిహెచ్ఎంసి అధికారులు, ప్రభుత్వం మంచిగా ఉన్న రోడ్లను, డ్రైనేజీ పైపు లైన్లను పదేపదే త్రవ్వుతున్నారు తప్ప ఇటువంటి డ్రైనేజీ సమస్యలపై ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. అనవసరంగా ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు తప్ప.. అవసరం వచ్చే పనులు మాత్రం చేయడం లేదని విమర్శించారు. వెంటనే డ్రైనేజీ లైన్ ను మార్చి కొత్త లైన్ కనెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, హస్మి బాబు, లెనిన్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు