Sunday, May 12, 2024

ఒకే సిమ్‌..రెండు వాట్సాప్‌లు

తప్పక చదవండి
  • సెకండ్‌ అకౌంట్‌ యాడ్‌ చేసే ఫీచర్‌ లాంచ్‌
  • త్వరలో అందుబాటులోకి రానున్నట్లు తెలిపిన సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌

న్యూ ఢిల్లీ : ఒకే సిమ్‌పై రెండు వాట్సాప్‌ ఖాతాల్లోకి లాగిన్‌ అయ్యే సదు పాయం త్వరలో అందుబాటులోకి రానుంది. వాట్సాప్‌ మాతృసంస్థ ‘మెటా’ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఈ విషయం వెల్లడిరచారు. ప్రస్తుతం ఒక సిమ్‌పై రెండు వాట్సాప్‌ ఖాతాల్ని కలిగి ఉండటా నికి అవకాశం లేదు. రెండో సిమ్‌ లేదా రెండో ఫోన్‌ వాడాల్సిందే. ఒకే ఫోన్‌లో ఒకే యాప్‌లో రెండు వాట్సాప్‌ ఖాతాల్ని వాడుకునే సరికొత్త ఫీచర్‌ను తెస్తున్నామని, ఇది ఆండ్రాయిడ్‌ యూజర్లకు మరికొ ద్ది రోజుల్లో అందుబాటులోకి వస్తుందని జుకర్‌బర్గ్‌ తెలిపారు. వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కొన్ని సెకన్లలలో రెండో అకౌంట్‌ను ఓపెన్‌ చేయవచ్చునని, రెండు ఖాతాలకు ప్రైవసీ, నోటిఫికేషన్‌ సెట్టింగ్స్‌ ఒకే విధంగా ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

స్టెప్‌ 1: ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసి, త్రీ డాట్స్‌ మెనూ నుంచి సెట్టింగ్స్‌కు వెళ్లాలి.
స్టెప్‌ 2: ప్రొఫైల్‌ నేమ్‌ పక్కన ఉన్న యారో సెలక్ట్‌ చేసి, ‘యాడ్‌ మొబైల్‌ నంబర్‌’పై క్లిక్‌ చేయాలి. రెండవ నంబర్‌ను వెరిఫై చేయడానికి ఆన్‌స్క్రీన్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఫాలో అవ్వాలి.
స్టెప్‌ 3: మరొక మొబైల్‌ నంబర్‌ను యాడ్‌ చేశాక, ప్రొఫైల్‌ నేమ్‌ పక్కన ఉన్న యారో ఐకాన్‌ క్లిక్‌ చేసి అకౌంట్ల మధ్య సులభంగా మారవచ్చు. చాట్‌ బబుల్స్‌ కలర్స్‌ ఆధారంగా ఏ అకౌంట్‌ ఉపయోగిస్తున్నారో తెలుసుకోవచ్చు. మొదటి అకౌంట్‌లో గ్రీన్‌ చాట్‌ బబుల్స్‌, రెండో అకౌంట్‌లో బ్లూ చాట్‌ బబుల్స్‌ ఉంటాయి.
ఆండ్రాయిడ్‌ వినియోగదారులందరికీ ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్‌ పేర్కొనలేదు. అయితే కొంతకాలంగా కొంతమంది బీటా వినియోగదారులతో దీనిని పరీక్షిస్తోంది. ఈ ఫీచర్‌ వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.23.21.12లో సపోర్ట్‌ చేస్తుంది. లాంచింగ్‌కు ముందే ఈ స్పెసిఫికేషన్‌ను టెస్ట్‌ చేయాలనుకుంటే, వాట్సాప్‌ బీటా ప్రోగ్రామ్‌లో చేరవచ్చు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు