Saturday, May 18, 2024

ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి

తప్పక చదవండి
  • బోగస్‌ ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ పార్లమెంటు అధ్యక్షులకు, అసెంబ్లీ ఇంచార్జీలకు సూచన

హైదరాబాద్‌ : వచ్చే ఎన్నికల్లో ఓటర్ల జాబితా సవరణ పై ఎప్పటి కప్పుడు టీడీపీ నాయకులు,కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ సూచించారు. శుక్రవారం ఓటర్ల జాబితా పై పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బోగస్‌ ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల నమోదుపై అప్రమత్తంగా ఉండాలన్నారు. టీడీపీ మద్దతుగా ఉన్న ఓటర్లను తొలగించి నట్లయిటైతే.. వాటిని సవరించేందుకు రిటర్నింగ్‌ అధికారికి పిర్యాదు చేయాలని సూచించారు. గ్రామ, మండల, డివిజన్‌, వార్డు స్థాయిలో ఓటర్లు అర్హులా? అనర్హులా? పరిశీలించాలన్నారు. అనర్హులు ఉన్నట్లయితే వారి తొలగింపుపై క్షేత్ర స్థాయిలో బిఎల్‌ఓలకు, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమీషన్‌ అధికారులకు పిర్యాదు చేసి వాటిపై చర్యలు తీసుకోవాడానికి పార్టీ లీగల్‌ సెల్‌ ను సంప్రదించాలని పార్లమెంట్‌ అధ్యక్షులకు, అసెంబ్లీ ఇంఛార్జులను కాసాని జ్ఞానేశ్వర్‌ ఆదేశించారు.
ఓటర్ల జాబితా పై అప్రమత్తంగా ఉండాలి..
హైదరాబాద్‌ సికింద్రాబాద్‌, చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని ఓటర్ల జాబితా పై అప్రమత్తంగా ఉండాలని నాయకులకు కాసాని జ్ఞానేశ్వర్‌ వారికి సూచించారు. గతంలో జరిగిన తప్పిదాలని మళ్ళీ జరగకుండా ఓటర్ల జాబితా సవరణ పై అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న బూత్‌ కమిటీలలో వెంటనే ఏజెంట్లను నియమించాలని సూచించారు. వారికి ఓటర్లపై అవగాహన ఉండేలా.. బోగస్‌ ఓట్లను తొలగించే విధంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు . ఈ విషయంలో అసెంబ్లీ పరిధిలో ఉన్న లీగల్‌ సెల్‌ ద్వారా బిఎల్‌ఓలకు, రాష్ట్రస్థాయిలో ఉన్న ఎలక్షన్‌ కమిషన్‌ సీఈఓ కు ఆఫ్లైన్‌, ఆన్లైన్‌ ద్వారా దరఖాస్తు/ ఫిర్యాదు చేసి.. పార్టీకి మద్దతుగా ఉన్న ఓటర్లను జాబితా నుండు తొలగించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఫామ్‌ 6, 7 ల దరఖాస్తులను సెప్టెంబరు నెలాఖరు వర కు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాఘవేంద్ర ప్రతాప్‌, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి రవీంద్రా చారి, రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు