Tuesday, April 30, 2024

అప్రమత్తంగా ఉండండి

తప్పక చదవండి
  • పరిశుభ్రతతో వ్యాధులు దరిచేరవు…
  • జిల్లాలో ఇప్పటివరకు 18 డెంగ్యూ పాజిటివ్‌ కేసులు నమోదు.
  • వ్యాధి నిరోధక శక్తి తక్కువ వుంటే డెంగ్యూ సోకే అవకాశం.
  • జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బీ. మాలతి.

ఖమ్మం : సీజనల్‌ వ్యాధులు పట్ల అవగాహన కల్గివుం డాలని, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులు దరిచేరకుండా కాపాడుకోవచ్చని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మాలతి అన్నారు. వర్షాకాలం కావున దోమలు అభివృద్ధి చెంది, దోమలతో డెంగ్యూ, మలేరి యా తదితర వ్యాధులు వచ్చే అవకాశం ఉంద ని ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లాలో 2023 సంవత్సరంలో ఇప్పటివరకు 18 డెంగ్యూ పాజి టివ్‌ కేసులు నమోదు అయినట్లు, పాజిటివ్‌ వచ్చిన వారికి చికిత్స అందించి, ఆయా కేసుల ఇంటి లోపల, బయట, పరిసరాల్లో పైరిత్రం పిచికారీ చేయించి, వ్యాధి ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. గత సంవత్సరం (2022)లో జిల్లాలో 711 పాజిటివ్‌ కేసులు రాగా, ముంద స్తు నియం త్రణ చర్యలు వల్ల డెంగ్యూ పాజిటివ్‌ కేసులు చాలా వరకు తగ్గినట్లు ఆమె అన్నారు. ఈడీస్‌ ఈజిప్టే అనే దోమకాటు వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని ఆమె తెలిపారు. నవజాత శిశువులు, గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువ కలిగియున్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆమె అన్నారు. దోమల నియంత్రణతో వ్యాధి కట్టడి చేయవచ్చన్నారు. ప్రతి మంగళ, శుక్రవారాలు డ్రై డే లుగా పాటించాలని, ఆ రోజుల్లో ఇల్లు, ఇంటి పరిసరాలలో నిల్వ ఉన్న నీటిని తొలగించడం, ఇంటిలో ఉన్న నీటి తొట్టెలు, సిమెంట్‌ కుండీలు, డ్రమ్ములలో ఉన్న నీటిని మొత్తం పారబోసి, శుభ్రంగా కడిగి, ఆరబెట్టినా తరవాత నీరు నింపుకోవాలన్నారు. దీనివల్ల ఈడిస్‌ దోమ జీవిత చక్రానికి అంతరాయం ఏర్పడి, లార్వాలు అంతరిస్తాయన్నారు. దోమల నియంత్రణలో ప్రజలు పాలుపంచుకోవాలని జిల్లా వైద్యాధికారిణి అన్నారు. పనికిరాని గుంతలను, లోతట్టు ప్రదేశాలను, వాడని బావులను పూడ్చి, నీరు నిల్వ కాకుండా చూడాలన్నారు. కొబ్బరిబోండాలు, ప్లాస్టిక్‌ కప్పులు, పగిలిపోయిన మట్టి కుండలు, పాడైన టైర్లు లేకుండా చూడాలని ఆమె తెలిపారు. చెత్త, చెదారం మురుగు కాల్వల్లో చేరకుండా చూడాలన్నారు. మురుగుకాల్వల్లో పూడిక తీసి, నీరు పారేలా చేయాలన్నారు. కంప చెట్లు, పిచ్చి మొక్కలను తొలగించాలని, పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని ఆమె తెలిపారు. చికిత్స కన్నా నివారణ చాలా సులువు అని గ్రహించి, దోమలు పుట్టకుండా, కుట్టకుండా అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిణి తెలిపారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు