Wednesday, April 24, 2024

ఏటియంలలో భారీ చోరీ..

తప్పక చదవండి
  • 26 ఏటీఎం కార్డులతో రూ. 7 లక్షల స్వాహా..
  • సాంకేతిక పరిజ్ఞానంతో డబ్బులు డ్రా చేసిన వైనం..
  • సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు..

వైరా : ఖమ్మం జిల్లా వైరా. తల్లాడ మండల కేంద్రాల్లో.. డిసిసిబి బ్యాంక్‌ ఎటిఎం లలో ఏటీఎం కార్డులతో గుర్తుతెలియని దొంగలు నగదు చోరీ చేశారు. జులై ఒకటో తేదీన వైరా లో సాంకేతిక పరి జ్ఞానంతో 17 ఏటీఎం కార్డులతో నాలుగు లక్షల 16 వేల రూపాయలు, తల్లాడ లో 11 ఏటీఎం కార్డుల ద్వారా 2, లక్షల 80, వేల రూపాయల నగదు చోరీ చేశారు. ఈనెల ఒకటో తేదీన అంతర్రాష్ట్ర దొంగలు 17 ఏటీఎం కార్డులు ద్వారా 30 సార్లు నగదు చోరీకి పాల్పడ్డారు అంతర్‌ రాష్ట్రానికి చెందిన ఎనిమిది మంది యువకులు ఒక ముఠాగా ఏర్పడి ఏటీఎం లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నగదు చోరీకి పాల్పడ్డారు. బ్యాంకు సిబ్బంది ఏటీఎంలలో నగదు పెట్టే సమయంలో నగదు కౌంటింగ్‌ తేడా రావడంతో అనుమానం వచ్చిన బ్యాంకు మేనేజర్‌ సీసీ ఫుటేజ్‌ లను తనిఖీ చేశారు. దీంతో ఒకటో తేదీన ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఏకధాటిగా ఏటీఎం కార్డులు ద్వారా నగదు డ్రా చేసిన సీసీ ఫుటేజీ బయటపడిరది.. దీంతో నగదు లెక్కించగా వైరా ఏటీఎంలో నాలుగు లక్షల 16 వేల రూపాయలు నగదు మాయమయ్యాయి.. అదే సమయంలో తల్లాడ డిసిసిబి ఏటీఎంలో 2,80,000 నగదు మాయం అయ్యాయి.. దీంతో బ్యాంకు సిబ్బంది లావాదేవీలను పరిశీలించి తల్లాడ వైరా పోలీస్స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు.. దీంతో వైరా తల్లాడ ఎస్సై లు సురేష్‌ మెడ ప్రసాద్‌ బ్యాంకు ఎటిఎంలను పరిశీలించి సిసి ఫుటేజ్‌ లను స్వాధీనం చేసుకున్నారు.. సీసీ ఫుటేజీల ఆధారంగా కేసు నమోదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు