Wednesday, June 19, 2024

ఫాలోవర్స్ కి మాత్రమే..!

తప్పక చదవండి
  • పేదల దరి చేరని బీసీ బంద్..
  • గులాబీ నేతల పైరవీలకి పెద్దపీట..
  • ఎమ్మెల్యేల అనుచరుల వద్ద
    చక్కర్లు కొడుతున్న జాబితా..
  • గ్రీన్ సిగ్నేచర్ కి పరిమితమైన అధికారులు..
  • తెల్లబోతున్న దరఖాస్తుదారులు..
  • నిరీక్షించినా ఫలితం లేదు..

గులాబీ నేతల ఫాలోవర్స్ కు మాత్రమే బిసి బంద్ పరిమితమైంది. నిరుపేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా అవి పేదల దరి చేరడం లేదు. ఏ పాలకులు వచ్చిన వారి అనుచరులకు, వారు చెప్పు చేతుల్లో ఉండే వారిని మాత్రమే అక్కున చేర్చుకుంటున్నారు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బలహీన వర్గాల వారికి బీసీ బంద్ తాయిలం ద్వారా ఓట్లు రాబట్టుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నం సామాన్యుల దరి చేరకపోయినప్పటికీ, గులాబీ నేతల పైరవీదారులకు మాత్రం లబ్ధి చేకూర్చింది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి ఈ పథకాన్ని అమలు చేస్తామని.. ఒకవైపు పాలకులు మరోవైపు అధికారులు గొప్పలు చెప్పినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా పని చేయట్లేదు. బలహీన వర్గాల్లో నిరుపేదలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ బందు పథకం క్షేత్రస్థాయిలో అభాసు పాలవుతుంది. బలహీన వర్గాల్లో చేతివృత్తులకు చేయూతనిచ్చేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం గత నెల అర్హులైన లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని ఆదేశాలు జారీ చేసింది. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారితోపాటు, బీసీలో నూట పన్నెండు కులాలు ఉన్నప్పటికీ వారిలో రజక, విశ్వబ్రాహ్మణ, నాయీ బ్రాహ్మణ, కమ్మరి, శాలివాహన, మేదరి తదితర 15 కులాల వారికి దరఖాస్తు చేసుకునే విధంగా ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల వారైతే రూ.1.50 లక్షలోపు, పట్టణ ప్రాంత వారైతే రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం కలిగి ఉండాలని నిబంధనలో పేర్కొంది. వీటితో పాటుగా 5 సంవత్సరాల నుంచి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.50 వేల కంటే ఎక్కువ లబ్ధి పొందిన వారు అనర్హులుగా పరిగణిస్తారనీ చెప్పుకొచ్చారు.
ఇందులో భాగంగా గత నెల 20వ తేదీ వరకు లక్షలాదిమంది లబ్ధిదారులు బిసి బంద్ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ సెంటర్ ల వద్ద పడిగాపులు కాసి పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో ప్రజల నుంచి ఒత్తిడి అధికమైంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి అర్హులైన వారికి మాత్రమే బీసీ బంద్ పథకం వర్తింప చేస్తామని ప్రకటించారు. నేపద్యంలో దరఖాస్తుదారులు ఊరట చెందినప్పటికీ ఫలితాలు మాత్రం అడియాశలయ్యేలా చేశాయి. గ్రామ పట్టణ స్థాయిలో అధికారులు దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. కానీ ఈ జాబితాలో గులాబీ నేతల అనుచరుల పేర్లు కానీ, వారు సూచించిన వ్యక్తుల పేర్లు కానీ లేకపోవడంతో అధికార పార్టీ నేతలు అసహనానికి గురయ్యారు. ఎమ్మెల్యేల చేతికి పని పెట్టాల్సి వచ్చింది. అధికారులు ఎంపిక చేసిన జాబితాను పక్కకు పెట్టకుండానే పెట్టినట్టు చేసి గ్రామస్థాయి నుండి నియోజకవర్గం స్థాయి వరకు అధికార పార్టీ నేతల సలహా మేరకే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు స్పష్టమవుతుంది. శాసనసభ్యులు సూచించిన లబ్ధిదారులను అధికారుల ఎంపిక జాబితాలో పొద్దపరిచినట్లు తెలుస్తుంది. కేవలం మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు జాబితాపై సంతకాలు చేసేదికే పరిమితమయ్యారని స్పష్టమవుతుంది. ఈ విధంగా అధికారులు ప్రతి మండలానికి 300 చొప్పున లబ్దాలను ఎంపిక చేశారు. ఈ జాబితాలో దాదాపు 70 శాతం మంది పేర్లు నాయకులు సూచించిన పేర్లే కనిపిస్తున్నాయి.

- Advertisement -

వ్యవసాయ భూములు, వ్యాపారాలు చేస్తూ దర్పం ప్రదర్శించే వారికి మాత్రమే పెద్దపీట వేశారు. నిజమైన లబ్ధిదారులను పక్కనపెట్టి ప్రశ్నించే వారి నోరు మూసేస్తున్నారు. మరో జాబితాలో మీ పేర్లు తప్పనిసరిగా ఉంటాయని చెప్పుకుంటూ వస్తున్నారు. ఎంపిక చేసిన జాబితాను అధికారులు అధికారికంగా విడుదల చేయనప్పటికీ గ్రామాలలో పట్టణాలలో జాబితా లిస్ట్ చెక్కర్ల కొడుతుంది. అర్హులైన లబ్ధిదారులు జాబితాలో మా పేరు లేదని సంబంధిత అధికారులకు విన్నవించుకున్న పలితం లేకుండా పోతుంది. బీసీ బందు పథకం జీవో జారీ అయిన దగ్గర నుండి దరఖాస్తు చేసుకునే అతవరకు బలహీన వర్గాల ప్రజలు ఈ సేవ ఆన్లైన్ సెంటర్ల వద్ద పెద్ద ఎత్తున బారుడు తీశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి దరఖాస్తుదాల వద్ద నుంచి దాదాపు 350 కోట్ల రూపాయలు దరఖాస్తు రూపంలో నిధులు వచ్చాయి. మండలానికి 300 మంది చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 607 మండలాల్లో ప్రభుత్వం ఇంచుమించుగా రెండు లక్షల మంది లబ్ధిదారులను ఎంపిక చేసింది. ఇందులో 70 శాతం మేరకు పైగా గులాబీ నేతల ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారని తెలుస్తుంది.

కానీ జిల్లా ఉన్నతాధికారులు మాత్రం లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదని ఇంకా ప్రక్రియ కొనసాగుతూనే ఉందని చెప్పుకొస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చక్కెర్ల కొడుతున్న జాబితా పై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా స్థానిక నాయకుల వద్దకు వెళ్లి జాబితాలో మా పేరు రావాలంటే ఏం చేయాలని ఎలాగైనా మా పేరు జాబితాలో ఉండాలని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం నిబంధనల ప్రకారమే ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సహాయం అసలైన లబ్ధిదారులకు జరగకపోగా గులాబీ నేతల అనుచరులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని విషయం స్పష్టమవుతుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు