- వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీఓ..
- జీఓ కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్..
- రెవెన్యూ శాఖలో 20 వేల మందికి పైగా వీఆర్ఏలు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా పర్మినెంట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో కాపీని ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అందిస్తూ.. వీరిని వివిధ ప్రభుత్వ శాఖల్లో విలీనం చేయాలని జీఓ జారీ చేసింది. తద్వారా వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి, వీఆర్ఏలుగా పని చేస్తున్న వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మొత్తం 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు.