Saturday, October 12, 2024
spot_img

ఔటర్‌పై ఇక మరింత వేగంగా వెళ్లొచ్చు

తప్పక చదవండి

వేగాన్ని 120 కి.మీ పెంచుతూ ఉత్తర్వులు

హైదరాబాద్‌ : మణి హారం గా నిలిచిన ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై వాహనదారులు మరింత వేగంతో దూసుకు పోవచ్చు. ఈ మేరకు పుర పాలకశాఖ నిర్ణయం తీసు కుంది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్‌ పై గరిష్టంగా 100 కిలోవిూటర్ల వేగంతో వెళ్లడానికి వాహనదారులకు అనుమతి ఉంది. అయితే ఈ వేగాన్ని తాజాగా 120 కిలోవిూటర్లకు పెంచింది ప్రభుత్వం. పురపాలకశాఖ, ఓఆర్‌ఆర్‌ అధికారులతో మంత్రి కేటీఆర్‌ మంగళవారం సవిూక్ష నిర్వహించారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ప్రయాణికుల భద్రతకు మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటాం అన్నారు. సవిూక్ష అనంతరం పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ విూడియాతో మాట్లాడుతూ.. ఓఆర్‌ఆర్‌ పై స్పీట్‌ లిమిట్‌ ను 120 కిలోవిూటర్లకు పెంచినట్లు వెల్లడిరచారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్‌ అప్పగింత విషయంపై వివాదం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిరదని బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఓఆర్‌ఆర్‌ పై ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుందని. ఇది ఏటా ఐదు శాతం పెరగుతూ పోయినా 30 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి 30 వేల కోట్ల ఆదాయం చేకూరేదన్నారు. సొంత ప్రయోజనాలతో రాష్టాన్రికి వేలకోట్ల నష్టం వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. రాష్ట్ర ముఖ్య మంత్రిగా ఆ ఆరోపణలపై ప్రజలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని పలుమార్లు డిమాండ్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు