- తూంకుంట పెద్ద చెరువు శిఖంలో అక్రమ నిర్మాణాలు
- అదనపు కలెక్టర్ ఆదేశించినా చర్యలు తీసుకోవడంలో విఫలమైన మున్సిపల్ అధికారులు
- ఎఫ్‌టిఎల్ గుర్తులు వేసి చేతులు దులుపుకున్న మున్సిపల్ అధికారులు
- పరిపూర్ణ చర్యలు తీసుకునేదెప్పుడండూ ప్రశ్నిస్తున్న తూంకుంట ప్రజలు
శామీర్‌పేట ; మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి తూంకుంట మున్సిపాలిటీ కేంద్రంలోని తూంకుంట పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని అధనపు కలెక్టర్ అదేశించినా మున్సిపల్ అధికారులు కనీసం ఇంచుకూడా కూల్చకుండా ఆ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తూంకుంట గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ సర్పంచ్ వర్సెస్ కమీషనర్ మాటల యుద్దం:
తూంకుంట పెద్ద చెరువులోని ఎఫ్‌టిఎల్, బఫర్ జోతన్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వచ్చిన కమీషనర్‌ను ఈ కట్టడాలను కూల్చోద్దంటూ బీఆర్‌ఎస్ పార్టీ తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్‌లు అడ్డుకున్నారు. దీంతో అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చుతామన్న కమీషనర్‌ను మాజీ సర్పంచ్ నీవు వచ్చినప్పటి నుంచే తూంకుంటలో అవినీతి పెరిగిపోయిందంటూ నువ్వు ఓ అవినీతి కమీషనర్‌వి అంటు ఆరోపించారు. అలాగే రాజీవ్ రహదారి పక్కన 9 వందల గజాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆ మాజీ సర్పంచ్ కమీషనర్‌ను ప్రశ్నినించారు. దీంతో కమీషనర్ స్పందిస్తూ అక్రమ నిర్మాణాల పట్ల సహించేదే లేదని వాటిని కచ్చితంగా తొలగిస్తామన్నారు. కమీషనర్‌గా తన బాధ్యతలను మాత్రమే నిర్వహిస్తున్నానన్నారు. వీరి మధ్య మాటలు యుద్ద తీవ్ర స్థాయికి చేరడంతో నేను వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాను నువ్వ ఏమి చేసుకుంటావో చసుకో నేను ఇంకొ సంవత్సరం అయితే రిటైర్ అవుతానంటూ కమీషనర్ ఆ మాజీ సర్పంచ్‌కు సవాల్ విసిరాడు.
మంత్రి మల్లారెడ్డి అండతోనే భూకబ్జాకు యత్నం: ఎంపీటీసీ ఇందిరా…
మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ కేంద్రంలోని పెద్ద చెరువు శిఖం, దాని పక్కన ఉన్న మాకు చెందిన భూమిని తూంకుంట మాజీ సర్పంచ్ ఎద్దు నాగేష్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ తూంకుంట మున్సిపాలిటీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్‌రెడ్డిలు అక్రమణకు పాల్పడుతున్నారని ఆరోపిస్తు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వ్యక్తులు తమ భూమిని కబ్జాకు యత్నిస్తున్నారని ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని వారికే మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. అదికారులు ఆ అక్రమార్కులకు మద్దతు తెలుపడం వెనుకాల మంత్రి మల్లారెడ్డి హస్తం ఉందని ఆరోపిస్తు ఆక్రోశం వెల్లిబుచ్చారు. తమకు వారసత్వంగా, న్యాయంగా సంక్రమించిన ఆస్తిని ఆక్రమించుకునేందకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కమీషనర్ అమ్ముడు పోయాడు…
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తూంకుంట పెద్ద చెరువులో ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలు కూల్చడానికి వచ్చిన తూంకుంట మున్సిపల్ కమీషనర్ ఆ పని చేయకుండా అక్రమార్కులకు అండగా నిలబడుతూ తమ పట్టా భూమిలో నుంచి రోడ్డు వేసేందుకు స్వయంగా రాళ్లు ఎత్తడం ఎంతవరకు సమంజసమని కమీషనర్ తీరును తప్పుబడుతూ ఎంపీటీసీ ఇందిరా తూర్పారబట్టారు. ఎఫ్‌టిఎల్, బఫర్ జోన్‌లో అక్రమార్కులు కట్టిన నిర్మాణాలు కనీసం ఒక్క ఇంచుకూడా కూల్చకుండా వెల్లడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనమన్నారు.
ఉన్నతాధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకోవాలి..
తూంకుంటలోని పెద్ద చెరువు శిఖం వ్యవహారం రోజు రోజుకు తారా స్థాయి చేరుతుందని, ఉన్నతాధికారులు ఈ విషయంలో పకడ్భంధీగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఎంపీటీసీ ఇందిరా కోరారు. స్వలాభం లేకుండా బవిష్యత్తు తరాలకు చెరువు ఉపయోగపడేలా ప్రతి ఒక్కరు సహకరించి కృషి చేయాలన్నారు. ఇప్పటికైనా చెరువును రక్షించుకోవడానికి కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు.
తప్పక చదవండి
-Advertisement-