Saturday, July 27, 2024

నిర్మాణ పనుల్లో వేగం పెంచాలిఅధికారులు పర్యవేక్షణ చేపట్టాలి..

తప్పక చదవండి

రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి

సూర్యాపేట : ఇంటిగ్రేటేడ్‌ మార్కెట్‌, నూతన ఎస్పీ కార్యాలయం పనులను పరిశీలించిన రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌ రెడ్డి. ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటడ్‌ మార్కెట్‌ కింది కారిడార్‌ లో మరికొన్ని షాప్‌ ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేసి మున్సిపల్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. కూరగాయల షాప్స్‌, నాన్‌ వెజ్‌ షాప్‌ అలాగే పై కారిడార్‌ లో గల షాప్స్‌ లను పరిశీలించారు. మార్కెట్‌ లో డ్రైనేజ్‌ వ్యవస్థ పతిష్టాంగ ఉండాలని సూచించారు. అలాగే మార్కెట్‌ లోపల భాగంలో స్వచ్చమైన గాలి వెల్లందుకు ఎయిర్‌ మిషన్స్‌ ఏర్పాటు చేయాలని ముందుగా ఒక బ్లాక్‌ లో ఏర్పాటు చేసి తదుపరి విస్తరించాలని ఆదేశించారు. షాప్స్‌ కేటాయింపులో ఎక్కడ కూడా లబ్ధిదారులు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అన్ని షాప్స్‌ వినియోగలోకి రావాలని అలాగే ఐ.డి కార్డులు అంద చేయాలని అన్నారు.సమయం దగ్గరలో ఉన్నందున పనుల్లో వేగం పెంచాలని సూచించారు.అనంతరం జిల్లా పోలీస్‌ ఆఫీస్‌ (డిపిఒ)పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆఫీస్‌ కి వచ్చే రోడ్‌ మున్సిపల్‌ ద్వారా చేపట్టాలని సత్వరమే టెండర్లు పిలవాలని ఆదేశించారు. కాంపౌండ్‌ వాల్‌,కార్యాలయం బయట, లోపల భాగాలను పరిశీలించి పనుల్లో వేగం పెంచాలని సూచించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, అదనపు కలెక్టర్‌ పాటిల్‌ హేమంత కేశవ్‌, చీఫ్‌ ఇంజనీర్‌ పబ్లిక్‌ హెల్త్‌ శ్రీధర్‌, యస్‌.సి. కె. వెంకటేశ్వర్లు డి.యస్‌.పి. నాగభూషణం ,మున్సిపల్‌ కమిషనర్‌ రామనుజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు