Friday, May 17, 2024

చట్టం నియమనిబంధనలతో మాకేంటి పని..?

తప్పక చదవండి

దిల్సుక్‌ నగర్‌ : ఎల్బీనగర్‌ జోన్‌ పరిధిలోని, సరూర్‌ నగర్‌ సర్కిల్‌ లో అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు.. అందుకు కారణం ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కమర్షియల్‌ హబ్‌ గా మారిపోయింది… కొందరు అక్రమ నిర్మాణాదారులు ప్రభుత్వ నిబంధనలు ఏదేచ్చగా ఉల్లంఘించి.. పాత భవనాలను కమర్షియల్‌ భవనాలుగా మారుస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.. ఈ అక్రమ నిర్మాణదారులకు.. ప్రభుత్వం చట్టం, నియమ, నిబంధనలు ఏ మాత్రం వర్తించవు .. ఓ గృహ నిర్మాణదారుడు గడ్డిఅన్నారం డివిజన్‌ పరిధిలోని, కృష్ణానగర్‌ లో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా.. కమర్షియల్‌ భవనంగా మార్చి.. ప్రైవేట్‌ హాస్టల్‌ కు లీజుకు ఇచ్చడూ… మరో నిర్మాణదారుడు గడ్డి అన్నారం డివిజన్‌ పరిధిలోని..న్యూ గడ్డిఅన్నారం కాలనీ లో ప్రభుత్వ నిబంధనలు నాకు ఏమాత్రం పట్టనట్టుగా, అనుమతులను పట్టించుకోకుండా రెండు అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు… ఈ అక్రమ నిర్మాణల వెనుక ఉన్న కబంధహస్తాలు ఎవరివి.. వీటిపై అధికారులు చర్యలు తీసుకోరా? చట్టం వీరికి చుట్టమా? చర్యలు తీసుకోకపోవడం వెనక అంతర్యం ఏమిటి అందుకున్న చీకటి ముదుపులేనా…. అని సామాజిక కార్యకర్తలు టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులను ప్రశ్నిస్తున్నారు.. అధికారులు మౌనం వీడి యాక్షన్‌ తీసుకుంటారా లేదా… మరో కథనంతో మీ ముందుకు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు