Wednesday, May 15, 2024

కొత్తగా 14,881 మంది పోలీసు కానిస్టేబుల్స్‌

తప్పక చదవండి
  • పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో శిక్షణ
  • తుదిదశకు నియామక ప్రక్రియ: డిజిపి

హైదరాబాద్‌, త్వరలో కొత్తగా 14,881 మంది పోలీసు కానిస్టేబుల్స్‌ చేరనున్నారు. తెలంగాణ పోలీస్‌ నియామక మండలి ఆధ్వర్యంలో సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, కానిస్టేబుల్స్‌ నియామక పక్రియ తుది దశకు చేరింది. వారికి రాష్ట్రంలోని 28 పోలీస్‌ శిక్షణా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఆయా శిక్షణా కేంద్రాల్లో ఏర్పాట్లపై శిక్షణా విభాగం ఐజీ తరుణ్‌న జోషితో కలిసి డీజీపీ అంజనీకుమార్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌, అక్టోబర్‌ మాసాల్లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. శిక్షణ మొదలయ్యే కంటే ముందే అన్ని పీటీసీల్లో మౌలిక సదుపాయాల కల్పన, శిక్షణ అవసరమైన మెటీరియల్‌, వసతి సౌకర్యం తదితర ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. భవనాలకు మరమ్మతులు, టాయిలెట్ల సౌకర్యం, రీడిరగ్‌ రూమ్‌ ఏర్పాట్లకు నిధులు అందజేస్తున్నట్లు తెలిపారు. ట్రైనింగ్‌ కళాశాల్లో ఉన్న ఖాళీలను భర్తీకి వెంటనే చర్యలు చేపడుతామని చెప్పారు. కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వారికి మంచి గుణాత్మక శిక్షణ ఇవ్వాలని, తద్వారా రాబోయే 3035 సంవత్సరాలు సమాజానికి మంచి సేవలందిస్తారన్నారు.పీటీసీల ప్రిన్సిపాల్స్‌, అధికారులు సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. మంచి శిక్షణతో సమాజానికి ఉత్తమ సేవలు అందించినట్లవుతుందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోని విధంగా తెలంగాణలో నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మహిళా ట్రైనీలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని పోలీస్‌ అకాడమీలో అత్యున్నత పోలీస్‌ శిక్షణ మెటీరియల్‌ అందుబాటులో ఉందని, దాన్ని సద్వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. ఇందులో భాగంగా 2018లో 11,028 మంది, 2020లో 16,282 మంది పోలీస్‌ కానిస్టేబుళ్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్స్‌ నియామకాలు చేపట్టిందన్నారు. ప్రస్తుతం 202324 సంవత్సరంలో 14,881 మంది నియామకానికి ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. తెలంగాణ పోలీస్‌ అకాడమీలో 653 మంది, పీటీసీ అంబర్‌పేటలో 650, వరంగల్‌లో వెయ్యి మంది, కరీంనగర్‌లో 442 మంది, మేడ్చల్‌లో 250 మంది, సీటీసీ హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, నిజామాబాద్‌, వరంగల్‌లో 250 మంది చొప్పున, టీఎస్‌ స్పెషల్‌ పోలీస్‌ యూసుఫ్‌గూడలో 400, కొండాపూర్‌లో 450 మందికి, డిచ్‌పల్లిలో 350, మంచిర్యాలలో 325 మందితో పాటు ఇతర శిక్షణా సంస్థల్లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు