Friday, September 20, 2024
spot_img

జల్‌పల్లి మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం

తప్పక చదవండి
  • అడుగు వేశారా అంతే సంగతులు..
  • మురుగు చిత్తడితో పెను ప్రమాదం..
  • పాఠశాలల పిల్లలకు ప్రాణాంతకం..
  • విష జ్వరాలు ప్రబలే ప్రమాదం..
  • ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్న స్థానిక ప్రజలు..

జల్‌ పల్లి : జల్‌ పల్లి మున్సిపాలిటీ 16వ వార్డు సెంట్‌ ఫ్లవర్‌ పాఠశాల ఎదురుగా, పాత గ్రామ పంచాయితీ రహదారి రోడ్డుపై మురుగు చిత్తడిగా మారి నీరు నిలిచి ఉండడంతో ప్రజలకు ఇబ్బందికరంగా మారి నడవలేని స్థితి ఎదురుకోవలసి వస్తోందని స్థానిక బస్తీ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత పదిహేను రోజుల నుండి ఈ సమస్య జల్‌ పల్లి మున్సిపాలిటీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ, సంబంధిత అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి కనిపించక పోవడం దారుణం. ఇక్కడే ఉన్నసెంట్‌ ఫ్లవర్‌ పాఠశాల చిన్నారులు ఈ దారిపై నడవలేక ఇబ్బంది పడుతున్నారని, మురుగు, రోడ్డు సమస్య చాల రోజులుగా పరిస్కారం కావడం లేదని, మురుగు నీరు రోడ్డుపై చేరి రహదారులు చిత్తడి చిత్తడిగా మారుతున్నా స్థానిక కౌన్సిలర్‌ కానీ, మున్సిపల్‌ అధికారులు కానీ పరిష్కరించడములో శ్రద్ధ చూపడం లేదని.. వర్షాకాలంలో నిల్వనీటితో విష జ్వరాలు వచ్చే అవకాశం ఉండడముతో.. ఆప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాలనీలలో డ్క్రెనేజి నిర్మాణ పనులు త్వరగా జరిగేలా స్థానిక కౌన్సిలర్‌, మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని.. వెంటనే రాకపోకలు సాగించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం.. అధికార పార్టీ నేతలకు శాపం :
జల్‌ పల్లి పురపాలక సంఘంలోని పలు వార్డులలో మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్య ధోరణికి, బస్తీ ప్రజలే కాక, స్థానిక అధికార పార్టీ నేతలు సైతం ఇబ్బందికర పరిస్థితులు ఎదురుకోవలసి వస్తోంది.. జల్‌ పల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బంది చెత్త ఎత్తడంలో, అంతర్గత రహదారులు శుభ్ర పరచడంలో, మురుగు నీరు సాఫీగా వెళ్లేందుకు డ్క్రెనేజి పూడికతీత పనులు, సరైన రీతిలో చేపట్టక పోవడంతో.. స్థానికులు, అధికార పార్టీకి చెందిన చిన్నా, చితక బస్తీ నాయకులమైన మమ్మల్ని నిలదీస్తున్నారని, చిన్న చిన్న సమస్యలు సైతం పరిస్కారం కావడం లేదని, కాలనీలలో పర్యటించాలంటే ద్కెర్యం సరిపోవడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికార బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్‌ స్పందిచి, పలు వార్డులలో పర్యటించి, ప్రజల మొర ఆలకిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు