Saturday, July 27, 2024

రహదారి నిర్మాణంలో..నిర్లక్ష్యం

తప్పక చదవండి
  • జిల్లా కేంద్రం అనుసంధాన రోడ్డు ప్రారంభం ఎప్పుడు..?
  • ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనా పనులు మొదలుపెట్టలేదు..
  • మార్కింగ్‌ చేశారు నిర్మాణ పనులు మరిచారు..
  • ఈ రోడ్లు పూర్తయితే జిల్లా ప్రయాణం సుఖమయం..
    చౌటుప్పల్‌ : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తయారయ్యింది చౌటుప్పల్‌ మున్సిపాలిటీ నుంచి వెళ్లే వివిధ రహదారుల పరిస్థితి. చౌటుప్పల్‌ నుంచి తంగడపల్లి వెళ్లే రహదారిని ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తున్న సందర్భంగా హడావిడిగా రోడ్డు వేసి నామ మాత్రం పనులు చేశారు. ఇప్పటికీ నిర్మాణ పనులు పూర్తి కాలేదు. చౌటుప్పల్‌ నుంచి జిల్లా కేంద్రమైన యాదాద్రి భువనగిరికి వెళ్లవలసిన చిన్న కొండూర్‌ వయా పెద్ద కొండూర్‌ సంగెం నుంచి రహదారి విస్తరణ పనులు సగంలోనే నిలిచిపోయాయి. మార్కింగ్‌ చేశారు కానీ, నిర్మాణ పనులు మర్చిపోయారు. చౌటుప్పల్‌ నుంచి వలిగొండ వెళ్లేటువంటి రహదారులో విస్తరణ చేసి సెంట్రల్‌ లైటింగ్‌ ప్రపోజల్‌ చేసిన మున్సిపాలిటీ అధికారులు ఇప్పటికీ ఆ పనులను మార్కింగ్‌ చేయడం గాని, గుర్తించడం గాని చేయలేదు. దీని వెనుక అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా గుంతలమయం: చౌటుప్పల్‌ నుంచి వలిగొండ రహదారి సుమారు రెండు కిలోమీటర్ల పొడవున గుంతలు పడి ఉన్నాయి. ఇప్పటి వరకు అనేక ప్రమాదాలు జరిగినా కూడా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. సెంట్రల్‌ లైటింగ్‌ చేసి రోడ్డు విస్తరణ చేస్తే జిల్లాకు అనుసంధానం చేయవచ్చు.
    ప్రత్యామ్నాయంగా సంగెం – చిన్న కొండూరు రోడ్లు :
    చిన్న కొండూరు నుంచి సంగెం వరకు వెళ్లే రహదారికి ఇరువైపులా మార్కింగ్‌ చేశారు. సుమారు 16 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఆయా రోడ్లలో కల్వర్టు పనులు దాదాపుగా పూర్తయినవి.. హెచ్‌ఎండిఏ నిధులు నుండి ఆయా గ్రామాలలో నిర్మించిన సిసి రోడ్లు సైతం రోడ్డు విస్తరణలో భాగంగా రూల్స్‌ కనుగుణంగా నిర్మాణం జరిగింది. గ్రామ కేంద్రాల్లో జరిగింది కానీ, బయటి రహదారులు ఇప్పటివరకు జరగలేదు. దీనిపైన అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది.. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో కూడా ఇంతవరకు అధికార పార్టీ ఎమ్మెల్యే గాని, ప్రజా ప్రతినిధులు గాని చొరవ చూపకపోవడంతో జిల్లా కేంద్రానికి వెళ్లవలసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
    అసంపూర్తిగా చౌటుప్పల్‌ నుంచి తంగడపల్లి వెళ్లే రహదారులు :
    ఉప ఎన్నికల సమయంలో కేసీఆర్‌ ముఖ్యమంత్రి మునుగోడు, చండూర్‌ లో సభలు జరిపే క్రమంలో హడావిడిగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టి రాత్రికి రాత్రి రోడ్డు నిర్మాణం చేశారు కానీ, ఇప్పటివరకు చౌటుప్పల్‌ నాగులకుంట నుండి హైవే రోడ్డు వచ్చే సిమెంట్‌ రోడ్లు జాప్యం జరుగుతుంది. దీనిపైన కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కాంట్రాక్టర్లు రోడ్లు వేసినా కూడా సకాలం లో బిల్లులు రాకపోవడంతో పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.. ఈ రోడ్లలో సెంట్రల్‌ లైటింగ్‌ ను మున్సిపాలిటీ పరిధిలో ఉన్న తంగడపల్లి రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ చేస్తే శోభాయమానంగా, ఆహ్లాదకరమైన వాతావరణ పరిస్థితి నెలకొంటుంది.
    తంగడపల్లి రోడ్‌ అసంపూర్తికంగా ఉండడంతో తీవ్రఇబ్బందులు
    ఉప్పరగొని జంగయ్య (చికెన్‌ షాప్‌ యజమాని) :
    తంగడపల్లి రోడ్‌లో చికెన్‌ షాప్‌ ఉంది. ఈ రోడ్లో ఉప ఎన్నికల సమయంలో హడా విడిగా రోడ్లు వేశారు. కానీ అసం పూర్తిగా ఉన్నా యి. ప్రయాణి కులు, పాదాచా రు లు, వాహనదారులు ప్రయా ణిం చాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యాపార పరంగా చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకొని పూర్తి చేయాలి..
    సమస్యలు పరిష్కరిస్తాం : మున్సిపల్‌ చైర్మన్‌
    మున్సిపల్‌ పరిధిలోని వివిధ రోడ్లు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. అతి త్వరలో సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. తంగడపల్లి రోడ్డు కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం వల్లే జాప్యం జరుగుతుంది. చిన్న కొండూరు రోడ్డు ప్రజల సౌకర్యార్థం రోడ్డు వెడల్పు చేసే ప్రక్రియలో ఉన్నాం. వీలైనంత తొందరగా చిన్నకోండూరు నుండి హై స్కూల్‌ వరకు రోడ్డు వెడల్పు చేసి సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తాం. వలిగొండ రోడ్డు 100 మీటర్ల వెడల్పు ఉండాల్సింది. కొంతమంది ఆక్రమించినట్లు మా దృష్టికి వచ్చింది. వీలైనంత తొందరగా ఆర్‌ అండ్‌ బి అధికారులతో మాట్లాడి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు అసౌకర్యం కల్పించే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. రోడ్డు మరమ్మతుకు మా వంతు కృషి చేస్తాం.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు