Saturday, July 27, 2024

ఫీజు చెల్లించలేదని విద్యార్థిని బయటకు నెట్టేసిన కాలేజీ యాజమాన్యం

తప్పక చదవండి
  • ప్రశ్నించినందుకు టీ.సి ఇచ్చి పంపిస్తా అంటున్న కరెస్పాండెంట్‌
    సూర్యాపేట : ఫీజు కట్టలేదని విద్యార్థిని బయటకు పంపించిన సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రేస్‌ కళాశాల వద్ద చోటుచేసుకుంది. విద్యార్థుల తల్లితండ్రులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణంలోని రేస్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతుందని, ఫీజు చెల్లించలేదని మూడురోజుల క్రితం యాజమాన్యం ఇంటికి పంపించారని తెలిపారు. సోమవారం 10 గంటలకు కాలేజీ కి వచ్చి ఫీజు చెల్లిస్తానని చెప్పిన,కళాశాల యాజమాన్యం వినకుండా తన కూతురుని కాలేజీ నుండి బయటకు పంచించారని అన్నారు. ఫీజు చెల్లిద్దామని లోనికి వెళ్లడంతో ఇదేమైనా పశువుల సంతనా మీకు వీలున్నప్పుడు రావడానికి అంటూ టీ.సీ.తీసుకొని వెళ్లండంటూ యాజమాన్యం నిర్లక్ష్యగా మాట్లాడుతు న్నారని తండ్రి మక్బుల్‌ పాషా ఆవేదన వ్యక్తం చేసాడు.దాంతో విద్యార్ధుల తల్లితండ్రులు కాలేజీ గేటు ముందు బైఠాయించి, తక్షణం కాలేజీ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు