Sunday, September 24, 2023

మహిళా ఓ మహిళా..

తప్పక చదవండి

పురోగమించెను.. పురోగమించెను..
ప్రగతి పథంలో పురోగమించెను..
మహిళా.. మహిళా..
ఆత్మబలమునే ఆయుధ శక్తిగా..
సహన శీలతే యోగ శక్తిగా..
విద్యా ధనమే జ్ఞాన శక్తిగా..
కార్యాచరణే క్రియా శక్తిగా..
సంకల్పానికి.. సామర్ధ్యానికి..
వారధి తానై.. బహుముఖ ప్రజ్ఞతో..
శక్తి యుక్తుల సమాగమముతో..
ప్రభవించిన ప్రతిభా కిరణముగా..
ప్రగతి శీలత.. అభ్యుదయంతో..
సాధికారత.. అభ్యున్నతితో..
రాష్ట్ర ప్రగతిలో భాగధేయమై..
అనంత శక్తికి.. ప్రతి రూపంగా..
పురోగమించెను.. పురోగమించెను..

  • విజయభారతి అంతర్వేదిపాలెం..
    9052445001.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు