Saturday, July 27, 2024

మున్సిపల్ వార్డుల్లో సమస్యలు విలయతాండవం: కామేష్

తప్పక చదవండి

కొత్తగూడెం నియోజకవర్గంలోని మున్సిపల్ వార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్రప్రధాన యెర్ర కామేష్ కార్యదర్శి ఆరోపించారు. ఆయన పార్టీశ్రేణులతో కలిసి ఆదివారం ఇంటింటికి బీఎస్పీ కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య,ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5సంవత్సరాలకు ఒక సారి ఓట్ల కోసం మాత్రం ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థులు వస్తున్నారు తప్ప గెలిచిన తర్వాత ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. వార్డుల్లో కిన్నెరసాని మంచినీరు 10,15 రోజులకొకసారి వస్తుందని వార్డు ప్రజలు తమదృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. మార్చినెల నుంచి వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ సమస్య యధావిధిగా ఉందని ఆరోపించారు. గతంలో పట్టణప్రజల సౌకర్యార్థం వార్డుల్లో సింగరేణి యాజమాన్యం వీధి పంపులను ఏర్పాటు చేసిందన్నారు. కిన్నెరసాని నీరు ఇంటింటికి సరఫరా చేస్తున్నామని డాంబికాలకు పోయిన ఎమ్మెల్యే వనమా సింగరేణి వీధి కుళాయిలను నిర్వీర్యం చేశారన్నారు. దీంతో ప్రజలకు కిన్నెరసాని నీరు, సింగరేణి సరఫరాచేసే మంచినీరు రెండు లభించక నానా అగచాట్లు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాటం చేస్తూ ప్రజా జీవితంలో ఉన్న స్థానికుడిగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరారు. మూస ధోరణిలో ఎన్నికల్లో ఓట్లు వేయడం వల్లనే కొత్తగూడెం అభివృద్ధి జరగకుండా పోతుందన్నారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ పార్టీకి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంధం మల్లిఖార్జున్రావు, మాలోతు వీరునాయక్, శరత్, శారద, సుజాత, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు