Monday, October 14, 2024
spot_img

అయ్యప్ప దేవాలయానికి ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ కుటుంబ సభ్యుల 11.23 లక్షల విరాళం

తప్పక చదవండి
  • నూతన దేవాలయ నిర్మాణానికి
  • శక్తివంచన లేకుండా కృషి చేస్తా
  • దేవాలయ నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధుల సేకరణకు హామీ..

కొత్తూరు ప్రముఖ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినీ నిర్మాత బండ్ల గణేష్ అయ్యప్ప స్వామికి అపర భక్తుడు. అయ్యప్ప స్వామి దీక్ష ఇతర పూజా కార్యక్రమాలలో ఆయన నిత్యం ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. షాద్ నగర్ నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని ఎన్నో ఏళ్లుగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న దాఖలాలు నిరంతరం కనిపిస్తూనే ఉంటాయి.
షాద్ నగర్ ప్రాంతంలో ఎంతో ఆధ్యాత్మిక పేరు ప్రఖ్యాతిగాంచిన మహిమాన్వి అయ్యప్ప స్వామి దేవాలయ పునర్నిర్మాణానికి పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక సేవలో తరించేందుకు ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ముందడుగు వేయడం విశేషం. దాదాపు 6 కోట్ల రూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నందిగామ శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయ నూతన నిర్మాణానికి తనవంతుగా నిర్మాత బండ్ల గణేష్ 11 లక్షల 23. వేల రూపాయలను భారీ విరాళంగా ప్రకటించారు. బండ్ల నాగేశ్వర రావు ఆయన కుమారులు బండ్ల శివ బాబు, బండ్ల గణేష్ కుటుంబ సభ్యుల తరఫున ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు బండ్ల గణేష్ ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నిర్మాత బండ్ల గణేష్ స్వగృహంలో శ్రీశ్రీశ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి తదితర ఆలయ కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున నిర్మాత
గణేష్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ విశేషాలను వారిని అడిగి తెలుసుకున్నారు. శబరి అయ్యప్ప క్షేత్రం స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకునేలా కడుతున్న దేవాలయ నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారాన్ని అందిస్తానని బండ్ల గణేష్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆధ్యాత్మిక సేవ పరంగా తాను రెండున్నర కోట్ల వరకు విరాళాలను పోగు చేసే విధంగా శాయ శక్తుల కృషి చేస్తానని గురుస్వామి శ్రీ సతీషన్ నాయర్ గురుస్వామి కి హామీ ఇచ్చారు. తన స్నేహితులు, పరిచయస్తులు ఇతర వర్గాలతో చర్చించి ఆలయ కమిటీ ద్వారా అయ్యప్ప స్వామి నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున విరాళాలను పోగు చేయనున్నట్టు తెలిపారు. ఇక్కడి ప్రాంతాల్లోనే ఎక్కడా కనివిని ఎరుగని విధంగా నిర్మాణం జరుపుకుంటున్న ఆలయానికి ప్రతి ఒక్కరు సహకరించాలని బండ్ల గణేష్ పిలుపునిచ్చారు. ఆలయ నిర్మాణాలను ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా పర్యవేక్షించి నిర్మాణానికి ఆర్ధికంగా తమ వంతు సహకారం ప్రతి ఇంటి నుండి ఎంతోకొంత భక్తితో విరాళంగా ఇవ్వాలని భక్తులను గణేశ్ కోరారు.
32 ఫీట్ల ఎత్తులో నిర్మిస్తున్న ఆలయాలు.
అయ్యప్ప స్వామి, అమ్మవారి దేవాలయాలు 32 ఫీట్ల ఎత్తులో నిర్మాణం జరపడం గమనార్హం. అయ్యప్ప స్వామి ఆలయం మొత్తం రాతితో నిర్మిస్తుండగా, వినాయకుడు, అమ్మవారి ఆలయాలు ఇటుకలతో నిర్మాణం చేపడుతున్నారు. కాగా ఈ దేవాలయాలు మొత్తం కేరళలోని సంప్రదాయం బద్దంగా, ఆఘమ శాస్త్ర ప్రకారం నిర్మాణం జరుపుతున్నారు. దేవాలయ నిర్మాణానికి ఆర్థిక ప్రణాళిక.
సుమారు రూ.6 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అయ్యప్ప స్వామి నూతన దేవాలయానికి ఆర్థికపరమైన ప్రణాళికను గురుస్వామితో కలిసి బండ్ల గణేష్ చర్చించారు. విరాళాల సేకరణకు భక్తులను కలిసే విధంగా తన వంతు శాయ శక్తుల కృషి చేస్తానని చెప్పారు. ఆలయ కమిటీకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని బండ్ల గణేష్ భరోసా ఇవ్వడంతో ఆలయ కమిటీ. నిర్వాహకులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
అనంతరం గురుస్వామిని బండ్ల గణేష్ పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ సభ్యులు, ప్రముఖ జర్నలిస్ట్ డాక్టర్ ఖాజా పాషా, (కేపి) ఎంపిటిసిలు, మాజీ సర్పంచులు వున్నారు.
నందిగామ మండలంలో నిర్మిస్తున్న వినాయకుడు,

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు