Sunday, October 6, 2024
spot_img

ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పై ముదిరాజుల ఆగ్రహం

తప్పక చదవండి
  • క్షమాపణ చెప్పకపోతే ముదిరాజుల తడాఖా చూపిస్తాం

వికారాబాద్, ముదిరాజ్లపై అనుచిత వాఖ్యలకు చేసినందుకు ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డికి వికారాబాద్ ముదిరాజ్లు ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. ఆదివారం వికారాబాద్ నియోజక వర్గం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం చౌరస్తాలో కౌషిక్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ముదిరాజ్ల పట్ల అనుచిత వాఖ్యలకు పాల్పడిన పాడి కౌశిక్ రెడ్డిని సీఎం కేసీఆర్ వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కౌషిక్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే ముదిరాజుల తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు…
కానీ అసలు జరిగింది ఇదంటా..!!
నేను ఆ ఛానల్ కెమెరామెన్ను కిడ్నాప్ చేయలేదు. ఇదిగో ఆధారాలు అంటూ ప్రభుత్వ విప్
బీఅర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సిసి పుటేజిని విడుదల చేశారు కానీ అదే రోజు యూట్యూబ్ ఛానల్
కెమెరామెన్ ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డి ఇంట్లో భోజనం చేస్తున్న దృశ్యాలు ఆ ఫుటేజీలో కనిపిస్తున్నాయి.
ఆరోజు ఎటువంటి కిడ్నాప్ లు జరగలేదని, మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళిపోయాడు.
అంటూ ఎమ్మెల్సీ కౌషిక్ రెడ్డీ వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు