విశ్లేషణాత్మక శాస్త్రీయ విషయాలు వెల్లడించిన.. దేవముని దేవదైవజ్ఞ.. శ్రీ రుద్రపీఠం
హైదరాబాద్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీల జీవితం సుఖంగా గడుస్తుందా ..? అంటే గడవదనే చెప్పాలి అంటున్నారు శ్రీ రుద్రపీఠం.. దేవముని దేవదైవజ్ఞ. ఎందుకంటే వరుణ్ తేజ్ రోహిణి నక్షత్రంలోని రెండవ పాదములోకి వచ్చి వృషభరాశిలోకి వస్తే, లావణ్య త్రిపాఠి మాత్రం అశ్విని నక్షత్రం నాలుగవ పాదమునకు చెంది మేషరాశిలోకి వస్తుంది. వృషభ రాశి అయిన వరుణ్ కు మేషరాశి వారయిన లావణ్య వ్యయములోకి వస్తారు. వ్యయభావములో ఉన్న లావణ్య, వరుణ్ కు ఏవిధంగా చూసినా లాభమును చేకూర్చలేదు. సుఖమును ఇవ్వలేదు. జీవితాంతం కష్టంగాను, మనస్సు అశాంతిగాను, ఏదో ఒకటి కోల్పోయినట్లు బాధగాను గడుస్తూ వదలలేక, వదిలించుకోలేక అన్నట్లుగా ఉంటుంది. అదే విధంగా లావణ్యకు వరుణ్ ద్వితీయస్థానంలో అనగా కుటుంబ, ధన, మారకస్థానంలో ఉన్నాడు. దీనివలన లావణ్యకు ఆర్ధికపరంగాను, కుటుంబ పరంగాను ఎంత చక్కగా వున్నపటికీని మానసికంగా మరణం కలిగేంత కష్టంగా ఉంటుంది. కావున వీరి జీవితం అనుకున్నంత సుఖ, సంతోషములతో కాకున్నా సామాన్యంగాను కాక ఆవరేజ్ గా ఒడుదుడుకులుగా నడుస్తుంది. ఒడుదుడుకులకు ఓర్చుకొని ఓపికగా నడుచుకున్నట్లయితే జీవితం కష్టతరం కాకుండా జీవితసముద్రంలో హాయిగా ఈదుకొని పోవు నావలా ముందుకు సాగిపోతుంది.. కానీ విడాకులవరకు మాత్రం పోదు.. పోకుండా ఉండేందుకు ఇద్దరు కలిసి ఆకులో ఆకులై, పువ్వులో పువ్వులె, దారంలోని పోగులలాగ కలిసిపోయి జీవించగలగాలి.