Tuesday, May 21, 2024

వికారాబాద్‌లో మట్టి మాఫియా…

తప్పక చదవండి
  • అనుమతుల్లేవ్‌.. అడిగేటోళ్లు లేరు..
  • సొమ్ము చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు
  • చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం
  • బీఎస్పీ పార్టీ వికారాబాద్‌ అసెంబ్లీ ఇంచార్జీ
    పెద్ది అంజయ్య
    వికారాబాద్‌ : అనుమతుల్లేవ్‌.. అడిగేటోళ్లు లేరు.. ఇంకేముంది గుట్టలను తవ్వేస్తున్నారు. రూ.లక్షల విలువ చేసే మట్టిని దోచుకెళ్తున్నారు. ఇలా అక్రమార్కులకు మట్టి వ్యాపారం కాసుల వర్షం కురిపిస్తుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనీ బిఎస్పీ పార్టీ వికారాబాద్‌ అసెంబ్లీ ఇంచార్జీ పెద్ది అంజయ్య అన్నారు. బుధవారం ఆయన ఆదాబ్‌ జిల్లా ప్రతినిధితో మాట్లాడుతూ… వికారాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు పాతూరు, కామారెడ్డి గూడ, కోట్‌ పల్లి చెరువులో మట్టి తో పాటు బంట్వారం, మోమిన్‌ పేట, నవాబుపేట, పూడూరు మండలాలతో పాటు తదితర గ్రామాల శివారులోని ప్రభుత్వ, ప్రైవేట్‌ భూముల్లో ఉదయం, రాత్రి వేళల్లో నిత్యం అక్రమంగా జేసీబీల సాయంతో మట్టి తవ్వకాలు చేపట్టి ట్రిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ప్రకృతి తనకు తానుగా ఏర్పాటు చేసుకున్న గుట్టలను సైతం అక్రమార్కులు మట్టిని తవ్వి ప్రకృతి సంపదను కొల్లగోడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మట్టి గుట్టలు ఉండడంతో కొందరు చోటా, బడా నాయకులు, అనుచరులు ఈ దందా సాగిస్తున్నారు. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతున్న నియంత్రించే నాథుడే కరువయ్యారు. ఇంత పెద్ద ఎత్తున మట్టి మాఫియా జరుగుతున్న అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వ్యవహరిస్తుండడం విడ్డూరంగా ఉందనీ తెలిపారు. వికారాబాద్‌ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్‌ మట్టి మాఫియాను త్వరలోనే బట్టబయలు చేసి అధికారుల కళ్ళు తెరిపిస్తామన్నారు. మట్టి మాఫియా కొనసాగిస్తూ లక్షలు గడిస్తున్న అధిక అధికార పార్టీ లీడర్లకు, మట్టి మాఫియా అక్రమార్కుల బాగోతం బట్టబయలు చేసి త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు