Saturday, July 27, 2024

ఓటింగ్‌ యంత్రాలు, ఈవీఎంల

తప్పక చదవండి
  • పనితీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్‌
    సూర్యాపేట : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు, ఈవిఎఎంలు, వివి ప్యాట్స్‌ ల పని తీరు పై ప్రజలకు అపోహలు తొలగించి అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ తోకలసీ తెలిపారు. బుదవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల ప్రదర్శన కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌, జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్లు పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, యస్‌. మోహన్‌ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ ఓటర్లకు అవగాహన కల్పించేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్‌ రోజున ఏ విధంగా ఓటు వేయాలో ఓటు వేసిన తర్వాత వేసిన ఓటు కరెక్టుగా నమోదు కాబడినదా లేదా వివి ప్యాట్స్‌ నందు పరిశీలించుకుని నివృత్తి చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో మాక్‌ పోల్‌ నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఈవీఎం, వివి ప్యాట్స్‌ పనితీరుపై తమ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, ఎలక్షన్‌ నోడల్‌ అధికారులు అవగాహన కేంద్రంలో మాక్‌ పోలింగ్‌ లో తమ ఓటును వేసి పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్షన్‌ డిటి పద్మారావు, ఎఒ శ్రీదేవి , ఎలక్షన్‌ అధికారులు పార్టీల ప్రజా ప్రతినిధులు సిబ్బంది పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు