Saturday, July 27, 2024

శ్రీశైలం క్షేత్రంలో సామాన్య భక్తులకు మరిన్నీ సదుపాయాలు : ఈవో లవన్న

తప్పక చదవండి

ముఖ్యంగా ఉచితంగా మహా మంగళహారతి , వారంలో నాలుగురోజులపాటు ఉచితంగా శ్రీ స్వామివార్ల స్పర్శదర్శనం కల్పిస్తున్నామని వివరించారు. తెల్లరేషన్‌కార్డు కలిగిన వారికి నెలలో ఒకరోజున ఉచితంగా నిర్ధిష్టమైన ఆర్జిత సేవను జరిపించడం, భక్తులకు ఉచితంగా బ్యాటరీ వాహనాల ఏర్పాటు లాంటి చర్యలను తీసుకుంటున్నామని వెల్లడించారు.
మహామంగళహారతికి అవకాశం
సుప్రభాతం, మహామంగళహారతి టికెట్లను నిలుపుదల చేసి మహామంగళహారతి కి సామాన్య భక్తులకు అనుమతిస్తున్నామని ఆయన వివరించారు. సుప్రభాతం, మహామంగళహారతి దర్శనం టికెట్లు, మధ్య దళారీల ప్రమేయం, సిఫారసులు లేకుండా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని వెల్లడించారు. దీని వల్ల ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మూడువేల మంది సామాన్య భక్తులకు మహామంగళహారతి దర్శనం కలుగుతుందని వివరించారు.
వారంలో నాలుగురోజులు స్పర్శదర్శనం
వారంలో నాలుగురోజుల పాటు మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం 2 గంటలనుంచి శ్రీస్వామివారి స్పర్శదర్శనంఉచితంగా చేసుకోవచ్చని ఆయన తెలిపారు. కొత్త విధానం వల్ల ప్రతిరోజు 2,500 మంది స్పర్శదర్శనం చేసుకుంటున్నారని వివరించారు. మే నెల నుంచి అన్నీ ఆర్జిత సేవా టికెట్లు , స్వామివారి స్పర్శదర్శనం టికెట్లను ఆన్‌లైన్‌లో ప్రతినెల 25 వ తేదీన ఉంచుతున్నామని వెల్లడించారు. టికెట్ల లభ్యతను బట్టి గంట ముందు వరకు కూడా భక్తులు ఆన్‌లైన్‌ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చన్నారు. ఈ టికెట్లను మరింత సులభతరంగా పొందేందుకు ఇటీవల దేవస్థానం యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని ఈవో వివరించారు.
ఉచిత సామూహిక సేవలు
ధర్మప్రచారంలో భాగంగా తెల్లరేషన్‌కార్డు కలిగిన సామాన్య భక్తులు నెలలో ఒకరోజున ఉచిత సామూహిక సేవలను జరిపించుకునే అవకాశాన్నిదేవస్థానం కల్పిస్తుందని తెలిపారు. ప్రతీ నెలలో ఒకరోజున జరుపబడే నిర్ధిష్టసేవలో 250 మంది భక్తులు పాల్గొనవచ్చని, ఈ ఉచిత సామూహిక సేవకు ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగానే పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఉదయాస్తమానసేవ – ప్రదోషకాల సేవల నిర్వహణ
తగు రుసుము చెల్లించి ఆయా ఆర్జిత సేవలను జరిపించుకునే భక్తుల కోసం ఉదయాస్తమానసేవ – ప్రదోషకాల సేవలను ప్రవేశపెట్టామని దీనివల్ల సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యం ఉండదని ఆయన తెలిపారు.రెండు ఆర్జిత సేవలలో ఒక్కొక్క సేవకు పరిమితంగా కేవలం ఆరు టికెట్లు మాత్రమే ఇస్తున్నామని వివరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు