Saturday, July 27, 2024

ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతే..

తప్పక చదవండి
  • బండి సంజ‌య్ కి ఎమ్మెల్సీ క‌విత కౌంట‌ర్

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ట్వీట్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల కవిత ట్విట్ట‌ర్ వేదిక‌గా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ఆడ‌బిడ్డ త‌లుచుకుంది.. ఇక మీ అడ్ర‌స్ గ‌ల్లంతు అవుతుంద‌ని క‌విత హెచ్చ‌రించారు. పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభోత్స‌వంలో రాష్ట్ర‌ప‌తికి గౌర‌వం ద‌క్క‌దు. దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు. దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం మీకు క‌నిపించ‌డం లేదా? అని సంజ‌య్‌ను క‌విత ప్ర‌శ్నించారు.

బేటీ బచావో… బేటీ పడావో నినాదాల‌కే ప‌రిమిత‌మైంద‌ని క‌విత ధ్వ‌జ‌మెత్తారు. సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్‌లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి నెల‌కొంద‌న్నారు. మహిళల‌కు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం వ‌హిస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం అని క‌విత సంజ‌య్‌కు గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు