వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్‌ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని గురువారం షా వెల్లడించాడు.
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని.. బీసీసీఐ కార్యదర్శి జై షా పేర్కొన్నాడు. మూడు దేశాల బోర్డులు ఐసీసీకి తమ మ్యాచ్‌ల్లో మార్పులు చేయాల్సిందిగా కోరాయని.. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని గురువారం షా వెల్లడించాడు.
వరల్డ్‌కప్ మ్యాచ్‌లు నిర్వహించే మైదానాల్లో ప్రేక్షకులకు ఉచితంగా మంచినీళ్లు ఏర్పాటు విషయంపై కూడా బోర్డు దృష్టి పెట్టిందని జై షా తెలిపాడు. పుష్కరకాలం తర్వాత భారత గడ్డపై జరుగనున్న మెగా టోర్నీ కోసం ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాడు. మరోవైపు టీమిండియా ప్రధా న పేసర్ జస్ప్రీత్ బుమ్రా పూర్తి స్థాయిలో కోలుకున్నాడని.. జై షా వెల్లడించాడు.
తప్పక చదవండి
-Advertisement-