- భర్తను గొడ్డలితో నరికి..ఐదు ముక్కలుగా చేసి.. కాలువలో పడేసిన భార్య
- ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది.
- కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది.
- ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువలో పడేసింది.
- ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
గజ్రౌలా ప్రాంతంలోని శివనగర్ కు చెందిన రామ్ పాల్ (55), దులారో దేవి భార్యా భర్తలు. అయితే దులారో దేవి గత కొన్ని రోజులుగా భర్త స్నేహితుడితో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో నెలరోజుల తర్వాత కొడుకు, కోడలి వద్దకు వచ్చింది. వచ్చీ రాగానే భర్త అదృశ్యమయ్యాడని కుమారుడు సోన్ పాల్ కు తెలియజేసింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దులారో దేవి ప్రవర్తనపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణ సందర్భంగా భర్తను తానే చంపినట్లు నేరం అంగీకరించింది.
ఆదివారం రాత్రి మంచంపై నిద్రిస్తున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసినట్లు తెలిపింది. ఆ తర్వాత బాడీని ఐదు ముక్కలుగా చేసి సమీపంలోని కాలువలో పడేసినట్లు పేర్కొంది. దీంతో అతడి శరీర భాగాల కోసం పోలీసులు ఈతగాళ్ల సాయంతో కాలువలో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
తప్పక చదవండి
-Advertisement-