Friday, September 13, 2024
spot_img

ఎన్‌ఐఏసీఎల్‌లో ఆఫీసర్ పోస్టులు

తప్పక చదవండి

రిస్క్ ఇంజినీర్, జనరలిస్ట్స్‌, ఐటీ, హెల్త్‌, అకౌంట్స్‌, ఆటోమొబైల్ ఇంజినీర్లు త‌దిత‌ర విభాగాల‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భ‌ర్తీకి ముంబయిలోని భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత రంగంలో గ్రాడ్యుయేష‌న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగష్టు 01 నుంచి ప్రారంభంకానుండ‌గా.. ఆగష్టు 21 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు.
మొత్తం పోస్టులు : 450
పోస్టులు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1)
విభాగాలు : రిస్క్ ఇంజినీర్, జనరలిస్ట్స్‌, ఐటీ, హెల్త్‌, అకౌంట్స్‌, ఆటోమొబైల్ ఇంజినీర్ త‌దిత‌రాలు.
అర్హ‌త‌లు : సంబంధిత రంగంలో గ్రాడ్యుయేష‌న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ రాత పరీక్ష, మెయిన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
జీతం : నెల‌కు రూ. 80000
ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేదీ : ఆగష్టు 01
చివ‌రితేదీ : ఆగష్టు 21
వెబ్‌సైట్ : https://www.newindia.co.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు