Sunday, June 23, 2024

‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ బుక్‌ను ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌..

తప్పక చదవండి

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ బుక్‌ను సోమవారం ఆవిష్కరించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొమ్మిదేండ్ల కాలంలో అన్ని రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతిని నివేదిస్తూ ఫొటోలు, సమాచారంతో సీఎం కేసీఆర్ సూచనలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేతృత్వంలో ప్రభుత్వం కాఫీ టేబుల్ బుక్ ‘మెర్క్యురియల్ రైజ్ ఆఫ్ తెలంగాణ’ రూపొందించింది. ఈ బుక్‌ను సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు రాజీవ్ శర్మ, సీఎం ప్రధాన సలహాదారులు సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, సీఎస్ శాంతి కుమారి, సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ అశోక్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు ముషరఫ్, హరిచందన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలి కాపీని సీఎం కేసీఆర్‌తో పాటు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి సీఎస్‌ అందజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు