Saturday, July 27, 2024

ప్రవేట్‌ విద్యాసంస్థలతో కుమ్మక్కైన ఎంఈఓ

తప్పక చదవండి
  • విద్యార్థుల తల్లిదండ్రుల జేబులను ఖాళీ చేస్తున్న విద్యాసంస్థలు..
  • ప్రైవేటు విద్యాసంస్థల ఆగడాలపై కన్నెత్తి చూడని ఉన్నత అధికారులు
  • దేవరకొండ ఎంఈఓపై అధికారులు చర్యలు తీసుకోవాలి
  • ప్రైవేటు విద్యాసంస్థలు, అధికారులపై నల్లగొండ జిల్లా కలెక్టర్‌ స్పందించాలి..
  • బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్‌ రమేష్‌ నాయక్‌

దేవరకొండ :దేవరకొండలోని స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ దేవరకొండ నియోజకవర్గం అధ్యక్షులు రామావత్‌ రమేష్‌ నాయక్‌ మాట్లాడుతూ.దేవరకొండ నియోజక వర్గం లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాధుడే లేడు రెగ్యుర్లుగా టీచర్స్‌ పాఠశాలలో వస్తున్నారా లేదా అని పర్యవేక్షించాల్సినటువంటి ఎంఈఓ పట్టించుకోవడం లేదు ఎంఈఓ కార్యాలయంలో ఒక్కో సంతాకానికి ఒక్కో రేట్‌ తీసుకుంటూ విద్య వ్యవస్థ దిగజారుస్తూ.ప్రైవేట్‌ విద్యా సంస్థలు వారు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్న, క్వాలిఫికేషన్‌ లేనటువంటి టీచర్లు పెట్టుకొని అడ్డగోలు ఫీజులు పెంచుతూ పేద తల్లిదండ్రుల ముక్కు ముక్కు పిండి వసూలు చేస్తున్న ప్రైవేట్‌ విద్యా సంస్థలను నియంత్రించవలసిన ఎంఈఓ వారితో కుమ్మకై వారు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి ఈనాడు ప్రైవేటు విద్యాసంస్థలను విజిట్‌ చేయకుండా ప్రైవేట్‌ విద్యా సంస్థలు పిల్లల తల్లిదండ్రులను మా స్కూల్లోనే పుస్తకాలు కొనాలి మా స్కూల్లోనే బట్టలు కొనాలని వారిపై ఒత్తిడి చేసి ఒక్కొక్క పిల్లాడి తల్లిదండ్రుల దగ్గర సుమారు బట్టలకు 5000 అని పుస్తకాలకు 5000అని ఒకటో తరగతి పిల్లాడి పుస్తకాలకు 5000అని ఇవి కాకుండా బయట నుంచి మరొక వెయ్యి రూపాయల నోటు పుస్తకాలు తీసుకురావాలని వారి జేబులను కొల్లగొడుతున్న ప్రైవేట్‌ విద్యాసంస్థల మీద ఇంతవరకు స్థానికంగా ఉన్నటువంటి ఎంఈఓ ఏ ఒక్కరు కూడా వాటిని విజిట్‌ చేయడం గానీ దాంట్లో పరిస్థి తులు ఎట్లా ఉన్నాయి అని చూడడం గాని క్వాలిఫికేషన్‌ ఉన్నటు వంటి టీచర్లను పెట్టారా లేదా అని స్కూల్‌ ని (విజిట్‌) పర్యవేక్షిం చకుండా వాళ్ళు ఇచ్చేటువంటి మామూళ్లకు ఆశపడి పట్టించు కోకుండా ఉన్నటువంటి ఎంఈఓ పైన చర్యలు తీసుకో వాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌,డిఇఓను బహుజన్‌ సమాజ్‌ పార్టీ తరఫున డిమాండ్‌ చేస్తున్నాం అని అన్నారు.ఈ కార్యక్ర మంలో మహిళా కన్వీనర్‌ లలిత,పట్టణ అధ్యక్షుడు అట్టికేశ్వరం దయాకర్‌,స్వేరో స్టూడెంట్‌ యూనియన్‌ అధ్యక్షులు ఇంజమూరి శేఖర్‌,బీటీ సెల్‌ కన్వీనర్‌ శ్రీరామదాసు,తరుణ్‌ చారి, జంతుక అనిల్‌,మతంగి జాన్‌అంకురి శ్రావణ్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు