Tuesday, May 14, 2024

ఘనంగా స్వచ్ఛత పఖ్వడా ముగింపు వేడుకలు

తప్పక చదవండి

గోదావరి ఖని : స్వచ్చత పఖ్వడా కార్యక్రమం ముగింపు వేడుకలు శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆర్జీ-1 జీయం చింతల శ్రీనివాసు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆర్‌ జీవన్‌ లో అన్ని గనులు డిపార్ట్‌ మెంట్స్‌, పాఠశాలలు, సింగరేణి రెసిడెన్సియల్‌ కాలని, ఆసుపత్రులలో పరిశుభ్రత పర్యావరణం, కాలుష్య నివారణ కార్యక్రమం నిర్వహించంచడం జరిగినదని తెలిపారు. పరిసరాలను, మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచినట్లైతే దేశం కూడా పరిశుభ్రంగా మారుతుందని, పరిశుభ్రత అనేది మనందరం మన దినచర్యలో భాగంగా పెట్టుకొని ముందుకు సాగాలన్నారు. మన చుట్టు ఉన్న వారికి కూడా స్వచ్ఛత గురించి అవగాహన కల్పించాలని, పరిసరాలలో చెత్త చెదారం పడేయకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. బహిరంగ మలమూత్ర విసర్జనలు చేయరాదని తెలిపారు . సింగరేణి ప్రభావిత గ్రామాలైన సుందిళ్ల , ముస్త్యాల, జనగామ గ్రామములో బట్ట సంచులు అందజేసినట్లు తెలిపారు.ఈ సందర్భముగా స్వచ్చత పఖ్వడ గురించి నిర్వహించిన పరిశుభ్రత- పర్యావరణంపై వ్యాస రచన, డ్రాయింగ్‌ మరియు వకృత్వ పోటీలలో గెలుపొందిన సింగరేణి హైస్కూల్‌ సెక్టారు-1 విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో టిబిజికెయస్‌ ఉపాధ్యాక్షులు గండ్రా దామోదర్‌ రావు, యస్‌. ఓటు జియం రామ్‌ మోహన్‌, డిజియం పర్సనల్‌ సి. హెచ్‌ లక్ష్మీనా రాయణ, సియంఒఐ అధ్యక్షులు పోనగోటి శ్రీనివాసు, ఎన్విరాన్‌ మెంట్‌ అధికారి ఆంజనేయ ప్రసాద్‌, యూనియన్‌ నాయకులు ఎఐటియుసి మడ్డి ఎల్లయ్య, హెచ్‌ యం.యస్‌ దాము రమెష్‌, ఐయన్‌. టియుసి సదానందం, సిఐటియు మేదరి సారయ్య, బియంయస్‌ యదగిరి సత్తయ్య మరియు సీనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ బంగారు సారంగపాణి అధిక సంఖ్యలో అధికారులు, ఉద్యోగులు పాల్గోన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు